కమింగ సెలబ్రిటీస్ లిస్ట్ ‘కమింగ్ సూన్’

 Mike Kamminga hyderabad drugs caseతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాదకద్రవ్యాల వ్యవహారంలో ఇప్పటివరకు కెల్విన్ తో సత్సంబంధాలు ఉన్న వారిని విచారణ చేసి నివేదిక రూపొందించిన విషయం తెలిసిందే. ఇక కెల్విన్ జాబితాల విచారణ ముగుస్తున్న నేపధ్యంలో… పట్టుబడిన మైక్ కమింగ జాబితా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో అత్యంత కీలక నిందితుడిగా భావిస్తున్న మైక్ కమింగా నోటి వెంట ఎక్సైజ్ సిట్ సంచలన నిజాలు వెలుగు తెచ్చినట్లుగా సమాచారం.

సుమారు 1000 మందికి డ్రగ్స్ విక్రయించానని, తాను కూడా వాడేవాడిని, ఇవన్నీ తనకు సర్వసహజం అన్న విషయాన్ని ఇప్పటికే వెల్లడించిన కమింగా, మలి విచారణలో పలువురు సినీ స్టార్స్, రాజకీయ నాయకులు, ఐటీ సెక్టార్ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లను వెల్లడించినట్టు తెలుస్తోంది. కమింగను మరింత లోతుగా విచారించాలని భావిస్తున్న సిట్ అధికారులు, అతని కస్టడీ ముగియడంతో, మరోసారి కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని భావిస్తున్నారు.

ADVERTISEMENT

కమింగ నుంచి డ్రగ్స్ వాడకం దారుల జాబితాను అందుకున్న సిట్, అవసరమైతే వారిని కార్యాలయానికి పిలిపించాలని, లేకుంటే వారి వద్దకే వెళ్లి విచారించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాలతో కమింగకు లింకులున్నాయని తెలుసుకున్న సిట్, విచారణలో ఇతర దేశాల పోలీసుల సాయం కూడా తీసుకోవాలని యోచిస్తోంది. దీంతో కమింగ జాబితాలో రాబోయే సెలబ్రిటీలు ఎవరా అన్నది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories