ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో కరోనా పరిస్థితి చెయ్యిదాటుతున్నటుగా కనిపిస్తుంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో ఒకేరోజు 1,982 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి…. ఒక్క తిరుపతిలోనే ఒకేరోజు 809 పాజిటివ్ కేసులు వచ్చాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
దీనితో ప్రభుత్వం కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలలో మినీ లాక్ డౌన్ పెడుతుంది. చిత్తూరు, శ్రీకాకుళం, కడప జిల్లాలో మినీ లాక్ డౌన్ అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకే షాపులు మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. కేసులు ఎక్కువగా ఉన్న చోట మినీ లాక్ డౌన్ పెట్టడం పరిస్థితి అదుపులోకివచ్చాకా ఆంక్షలు సడలించడం చెయ్యాలని కేంద్రం ఆదేశించింది.
దీనివల్ల కేసులు అదుపులోకి రావడం, అలాగే ఆసుపత్రుల మీద ఒత్తిడి తగ్గడం జరుగుతుందని భావిస్తున్నారు. కర్ణాటకలో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం రెండు వారాల లాక్ డౌన్ ను ప్రకటించింది. చాలా రాష్ట్రాలు ఆ దిశగా పయనిస్తున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆ దిశగా ఆలోచన చెయ్యడం లేదు.
అయితే ప్రస్తుతం ఉన్న కేసుల ఉదృతి కారణంగా లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి.అయితే లాక్ డౌన్ తప్పించుకోవడానికి రెండు తెలుగు ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా కేసులను, కరోనా మరణాలను ఎక్కువ చేసి చూపిస్తుందని కూడా ఆరోపణలు ఉన్నాయి.





