‘ఇజం’ సినిమాతో దీపావళి చేసుకున్న ‘ఎమ్మెల్యే’

mla-roja-diwali-celebrationsదీపావళి అంటే తనకు ఎంతో ఇష్టమని… అగ్ర హీరోయిన్ గా ఉన్నా, రాజకీయాల్లో బిజీగా ఉన్నా దీపావళి పండుగకు కొత్త బట్టలు, మిఠాయిలు, సినిమాలు అన్నీ తనకు ఉండాల్సిందే అని ఒకప్పటి టాప్ హీరోయిన్, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. తన పిల్లలకు కూడా దీపావళి అంటే చాలా ఇష్టమని, దీపావళి పండుగకు తన అన్నయ్య పిల్లలు కూడా తమ దగ్గరకే వస్తారని, ఈ దీపావళికి పిల్లలతో కలిసి ‘ఇజం’ సినిమాకు వెళ్లానని చెప్పారు.

ప్రతి దీపావళి తనకు ఎన్నో ఙ్ఞాపకాలను మిగుల్చుతోందని… అయితే, ‘పెద్దన్నయ్య’ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు… తాను, బాలకృష్ణ కలిసి జరుపుకున్న దీపావళి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని… చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఆ దీపావళిని జరుపుకున్నామని చెప్పారు. తనతో పాటే అందరూ బాగుండాలని… తన వల్ల పది మందికి మంచి జరగాలని ఎప్పుడూ భగవంతుడిని కోరుకుంటానని రోజా తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories