మోడీ ప్రభుత్వానికి మొదటి ప్రమాద హెచ్చరిక.. మేల్కోవాల్సిందే!

Political analysis of Modi government challenges

ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రధాని మోడీ పట్ల దేశ ప్రజలలో కొంత వ్యతిరేకత ఉందని సీజేపీ ఆందోళనలతో మరోసారి బయపడింది. అంటే ఆ ఆందోళనలు, వాటి తీవ్రత, వారి డిమాండ్స్ చూసి కాదు.

వారి ఆందోళనలకు దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, ప్రముఖులు సంఘీభావం ప్రకటించడం గమనించినప్పుడు మోడీ ప్రభుత్వ తీరుని వారు కూడా తప్పు పడుతున్నట్లుగానే భావించవచ్చు.

ADVERTISEMENT

అంత మాత్రాన్న వారందరూ ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని కాదు. కానీ వారిలో ఎంతో కొంత వ్యతిరేకత నెలకొని ఉందని స్పష్టం చేస్తోంది.

ప్రకాష్ రాజ్ వంటివారు మొదటి నుంచి ప్రధాని మోడీని, బిజేపిని, వారితో కలిసి పనిచేస్తున్నవారినీ కూడా శత్రువులుగానే పరిగణిస్తున్నారు. కనుక అయన ఢిల్లీ వెళ్ళి సీజేపీ ఆందోళనలలో పాల్గొని బహిరంగంగానే తన వ్యతిరేకత మరోసారి చాటి చెప్పారు. వ్యతిరేకించడం అంటే ఇది!

కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ ఆందోళనలకు బహిరంగంగానే మద్దతు పలికింది. వారి తరపున మోడీ ప్రభుత్వంతో పోరాడింది కూడా. అలాగే సీజేపీ ఆందోళనల వెనుక ఆమాద్మీ పార్టీ కూడా ఉందనే ఊహాగానాలు వినిపించాయి.

వీటితో పాటు ప్రధాని మోడీని, బిజేపిని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు లేదా వారి వలన నష్టపోయిన పార్టీలు తలో చెయ్యి వేసి ఉండొచ్చు.

ఎవరి అవసరం వారిది.. ఎవరి లెక్కలు వారివి. కనుక సీజేపీ వెనుక రాజకీయపార్టీలు హస్తం ఉన్నా ఆశ్చర్యం కాదు. ఢిల్లీలో నెలరోజులు పైగా వేలాదిమంది ఆందోళనలు కొనసాగించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించి ఉన్నా ఆశ్చర్యం లేదు. అది తప్పని కూడా చెప్పలేము.

ఈ ఆందోళనలతో కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించడాన్ని సీజేపీ నాయకులు తమ తొలి విజయంగా చెప్పుకున్నారు. వారికి సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్‌ తదితర పార్టీలు కూడా ఇది తమ తొలి విజయంగా భావిస్తున్నాయి. సీజేపీ పైకి చెప్పుకుంది మిగిలిన వారు పైకి చెప్పుకోవడం లేదు అంతే తేడా!

ఒకే వ్యక్తి, ఒకే పార్టీ 15 ఏళ్ళు ఏకధాటిగా రాష్ట్రాన్ని, దేశాన్ని పాలిస్తున్నప్పుడు ప్రజలలో వారి పట్ల సహజంగానే వ్యతిరేకత ఏర్పడుతుంది.

గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఈవిధంగానే మార్చేశారు. కనుక వచ్చే ఎన్నికల నాటికి 15 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న మోడీ ప్రభుత్వానికి ఇలాంటి ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి.

ముఖ్యంగా బిజేపి కంచుకోటని ఏవిధంగా బద్దలు కొట్టవచ్చో గ్రెస్‌, మిత్ర పక్షాలు కనిపెట్టాయి. కనుక వచ్చే ఎన్నికలలో ఆ కోట కుప్పకూలిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రధాని మోడీ, అమిత్ షా, బిజేపి పెద్దలదే.

మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్‌ లేదా మరో పార్టీ, కూటమి అధికారంలోకి వస్తే అది కేవలం ప్రభుత్వం లేదా అధికార మార్పిడి మాత్రమే కాదు.

ఆ మార్పు యావత్ దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కనుక ప్రధాని మోడీ తన ప్రభుత్వాన్ని, పార్టీని, కూటమితో పాటు యావత్ దేశాన్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ ఆందోళనలు, వాటి వెనుక రాజకీయాలను పక్కన పెట్టి చూస్తే ఇది అర్ధమవుతుంది.

కనుక ఈ ఉద్యమం ఇంతటితో ముగిసిపోయిందని సంతోషపడటానికి లేదు. లైట్ తీసుకోవడానికి లేదు. దేశ ప్రజలలో వ్యతిరేకత పెరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. తమ ఆలోచనలను అమలుచేయడంతో పాటు, దేశ ప్రజల ఆకాంక్షలని కూడా గుర్తించి గౌరవించడం కూడా చాలా ముఖ్యమేనని గ్రహించాలి. అవసరమైతే సమూలంగా ఆలోచనలు, విధానాలు మార్చుకునేందుకు సిద్ధపడాలి. లేకుంటే మళ్ళీ మళ్ళీ బొద్దింకలు వస్తూనే ఉంటాయి. కంచుకోటని కొరికి పడేస్తాయి.

ADVERTISEMENT
Latest Stories