ప్రముఖ పర్ఫ్యూమర్ మోనికా ఘర్డే హత్య ఉదంతాన్ని పోలీసులు చేధించడంతో కొన్ని భయంకర నిజాలు వెలుగు చూసాయి. ఓ ఎటిఎంలో డబ్బులు డ్రా చేసి పట్టుబడ్డ రాజ్ కుమార్ సింగ్ ను విచారించిన అనంతరం, పోలీసులు ఆ ఘటన జరిగిన తీరును వెల్లడించారు. “అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో మోనికా ఫ్లాట్ లోకి నిందితుడు రాజ్ కుమార్ సింగ్ ప్రవేశించాడని, 6వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి 2.30 గంటల మధ్య ఆమెను హత్య చేశాడని” తెలిపారు.
ఈ క్రమంలో, దాదాపు 8 గంటల పాటు మోనికాకు రాజ్ కుమార్ ప్రత్యక్ష నరకం చూపించాడని చెప్పారు. అతను ఫ్లాట్ లోకి ప్రవేశించగానే సహాయం కోసం మోనికా గట్టిగా అరుస్తుండగా… ఆమె నోరు నొక్కేసి, కత్తితో బెదిరించాడని, రాజ్ కుమార్ ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మోనికా శరీరంపై ఎక్కడ పడితే అక్కడ పంటి గాట్లు ఉన్నాయి. దీంతో పరీక్షల కోసం గోవా దంత వైద్యశాలకు నిందితుడిని పోలీసులు తీసుకెళ్లారని, ఆమె శరీరం మీదున్న పంటి గాట్లతో అతని పళ్ల సైజు కూడా సరిపోయినట్టు తేలింది.
ఈ పరిణామాలతో రాజ్ కుమార్ పై హత్యతో పాటు అత్యాచారం (ఐపీసీ సెక్షన్ 376), దోపిడీ (సెక్షన్ 392)ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ ఎనిమిది గంటల సమయంలో మూడు పోర్న్ వీడియోలను మోనికకు చూపిస్తూ పైశాచిక ఆనందంతో పాటు, ఆమెపై హత్యాచారం చేసాడని… రాజ్ కుమార్ చేసిన భయంకర వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారు. సదరు సంగతులన్నీ విచారణలో భాగంగా స్వయంగా నిందితుడు ఒప్పుకున్నవేనని పోలీసులు తెలిపారు.



