నెక్స్ట్ ఏంటి… మహానుభావుడు కదా..!

more expectations on mahanubhavudu with spyder fmovie talkదసరా పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా విడుదలకు ముస్తాబైన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” సినిమా గత వారం విడుదలై, భిన్న స్పందనలను తెచ్చుకుని, నేడు విడుదలైన “స్పైడర్” ఫలితంపై ఎక్కువ ఆధారపడింది. ఇక నేడు విడుదలైన ‘స్పైడర్’ టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా ‘బ్రహ్మోత్సవం’ తర్వాత గంపెడాశలతో మురుగదాస్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రిన్స్ అభిమానులు పూర్తిగా నిరుత్సాహం తప్పేలా ‘స్పైడర్’ టాక్ వెలువడుతోంది.

దీంతో దసరాకు వచ్చిన రెండు పెద్ద సినిమాలలో టాక్ పరంగా చూస్తే… ఇప్పటికే విడుదలై తొలి వారం పూర్తి చేసుకున్న ‘జై లవకుశ’ ఉండగా, దాని కంటే తక్కువ స్థాయి టాక్ తో ‘స్పైడర్’ సరిపెట్టుకుంది. దీంతో ఈ రెండు పెద్ద సినిమాల తర్వాత విడుదల కానున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మహానుభావుడు” పైనే సినీ ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఈ సినిమా అయినా ప్రేక్షకులకు కాస్తంతా వినోదాన్ని పంచితే, ఈ రెండు పెద్ద సినిమాలను మించిన విజయాన్ని “మహానుభావుడు” సొంతం చేసుకునే అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది.

ADVERTISEMENT

అయితే కమర్షియల్ గా “జై లవకుశ” ఇప్పటికే బంపర్ ఓపెనింగ్స్ ను రాబట్టగా, “స్పైడర్” ఓపెనింగ్స్ ఆ స్థాయిలో ఉంటాయో, లేదో అన్న సందేహం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ధియేటర్లలో ‘జై లవకుశ’ సందడి చేస్తుండగా, మరో రెండు రోజుల్లో ‘మహానుభావుడు’ మరికొన్ని ధియేటర్లలో ప్రత్యక్షం కానుంది. దీంతో ‘స్పైడర్’ పరిస్థితి ఏంటన్నది ఖచ్చితంగా తెలియాలంటే ఈవెనింగ్ షో వరకు వెయిట్ చేయాల్సిందే. తమిళ వాసన తెలుగు ప్రేక్షకులు రుచించడం కష్టమైన విషయం అన్న టాక్ తో అందరి చూపులు “మహానుభావుడు” పైకి వెళ్ళిపోయాయి.

ADVERTISEMENT
Latest Stories