వైసీపిలో కొత్త ఎంట్రీ… ఆయన కోసమే పెద్దాపురం సీటు రిజర్వ్?

Mudragada Padmanabham

మాజీ మంత్రి తోట నరసింహంను జగన్మోహన్‌ రెడ్డి హడావుడిగా పెద్దాపురం నుంచి జగ్గంపేటకు మార్చి నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుని పక్కన పెట్టేశారు.

ADVERTISEMENT

పెద్దాపురం నియోజకవర్గంపై మంచి పట్టున్న తోటని జగ్గంపేటకి తరలించడం దేనికంటే ఈ పెద్దాయన కోసమేనట! ఆయనే… ప్రముఖ కాపునేత ముద్రగడ పద్మనాభం.

నిజానికి జగన్మోహన్‌ రెడ్డి ఇదివరకే ఆయనను వైసీపిలోకి ఆహ్వానించి టికెట్‌ కూడా ఆఫర్ చేశారు. పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తూ కాపులను జనసేనవైపు వెళ్ళిపోకుండా నిలువరించేందుకు ఆయన చాలా అవసరమని జగన్‌ భావించారు. ఆయన కూడా ఇది గ్రహించి పవన్‌ కళ్యాణ్‌పై ఘాటుగా విమర్శలు చేశారు కూడా.

అయితే ఎన్నికల ఖర్చులు పెట్టుకోలేనని ముద్రగడ తేల్చిచెప్పేయడంతో జగన్‌ వెనక్కు తగ్గారు. అప్పటికి టిడిపి, జనసేనల పొత్తులు ఖరారు కాలేదు కనుక ఆయన అవసరం ఉండకపోవచ్చని జగన్‌ భావించారు. కానీ ఇప్పుడు వాటి పొత్తులు ఖరారైనందున ముద్రగడ ఎన్నికల ఖర్చులు భరించి పెద్దాపురం నుంచి బరిలో దింపాలని జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. అందుకే హడావుడిగా పెద్దాపురం నుంచి తోటని జగ్గంపేటకు రవాణా చేసిన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈవిషయం ముద్రగడ పద్మనాభం స్వయంగా ప్రకటించేవరకు వైసీపి ప్రకటించకూడదని ఆయన షరతు విధించడంతో అధికారిక ప్రకటన చేయలేదట!

జనవరి 1వ తేదీ లేదా సంక్రాంతి పండుగకు ముద్రగడ పద్మనాభం తన ఇంట్లో అట్టహాసంగా వేడుకలు జరుపుకోబోతున్నట్లు సమాచారం. దానికి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కాపునేతలను ఆహ్వానించి ఈ విషయం స్వయంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

కనుక ముద్రగడ పద్మనాభం వైసీపిలో ప్రవేశిస్తే, వైసీపి-టిడిపి, జనసేనల బలాబలాలు మారుతాయా లేదా?ఆయన వెంట రాష్ట్రంలో కాపులందరూ వైసీపికి మొగ్గు చూపుతారా లేదా?ఒకవేళ ఆయన గంపగుత్తగా కాపు ఓటర్లను వైసీపిలోకి తీసుకురాలేకపోతే జగన్మోహన్‌ రెడ్డి ఆయనను నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారా లేదా?ముఖ్యంగా జగన్మోహన్‌ రెడ్డితో ఆయన సర్దుకుపోగలరా లేదా?అనే ప్రశ్నలన్నిటికీ రాబోయే రోజుల్లో తప్పక జవాబులు లభిస్తాయి.

ADVERTISEMENT
Latest Stories