పోలీసుల అదుపులో చక్రి సోదరుడు, తల్లి!

family ruining Music-director-Chakri nameఎన్నో సినిమాలకు తన సంగీతంలో ‘ప్రాణం’ పోసిన చక్రి, తన కుటుంబ గేయాన్ని మాత్రం సరైన రాగంలో ఆలపించలేదన్న విషయం స్పష్టమవుతోంది. బహుశా అందుకే… ‘జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది…’ అనే పాటను అంత అద్భుతంగా ట్యూన్ చేసారేమో గానీ… చక్రి మరణానంతరం కుటుంబంలో భగ్గుమన్న వివాదాలు ప్రస్తుతం సోదరుడు మహిత్ నారాయణ, తల్లి విద్యావతిలను పోలీసులు అదుపులో తీసుకునేటంత వరకు చేర్చాయి.

చక్రి భార్య శ్రావణి, తల్లి విద్యావతిల మధ్య ఆస్తి విషయంలో రాజుకున్న వివాదంతో తమకు న్యాయం చేయాలంటూ రాజ్ భవన్ రోడ్డులోని చక్రి విల్లా ముందు విద్యావతి, మహిత్ నారాయణలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం సామాన్లంతా సర్దుకుని విల్లా ముందుకు చేరిన విద్యావతి, మహిత్ లు తమకు గూడు దొరికే దాకా అక్కడే బస చేస్తామంటూ రోడ్డెక్కారు.

ADVERTISEMENT

తాజాగా వీరిని గురువారం అర్ధరాత్రి పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ అధికార నివాసం రాజ్ భవన్ తో పాటు ప్రముఖులు నివాసముండే సోమాజిగూడ పరిధిలో వారు ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలోనే ‘న్యూసెన్స్’ కేసు కింద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విద్యావతి, మహిత్ లిద్దరూ ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఆస్తి విషయంలో తలెత్తిన ఈ వివాదంతో కుటుంబ సభ్యులు చక్రి ఆత్మకు క్షోభ మిగులుస్తున్నారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories