దేవికి ఆ సినిమా చావో రేవో నా?

Music Director Devi Sri Prasad loosing the offersదేవి శ్రీ ప్రసాద్ దాదాపుగా పదిహేనేళ్ళ నుండి టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ ప్రస్తుతం ఫామ్ లో లేక తిప్పలు పడుతుంది. ఈ మధ్య దేవి పని చేస్తున్న మెజారిటీ సినిమాల పాటలలో కొత్తదనం అనేది లేకుండా పోతుంది. తన పాత పాటలనే తిప్పి తిప్పి కొడుతున్నాడనే అపప్రధ ఎలాగూ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రానికి గానూ పాటలలో గానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో గానీ మెప్పించలేకపోయాడు. దానితో చాలా సినిమాలు ఆయన చెయ్యి జారుతున్నాయి.

ADVERTISEMENT

అఖిల్ సినిమాకు మొదట దేవిని అనుకున్నారు అయితే మహర్షి సినిమా తరువాత గోపి సుందర్ వైపు మొగ్గు చూపారు. వాల్మీకికి దేవి మ్యూజిక్ అని ప్రకటన కూడా చేశారు అయితే ఎందుకనో ఆయన్ని తప్పించి మిక్కీ జే మేయర్ ని పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ సినిమాకు కూడా దేవిని కాదని సైరాకు పని చేసిన అమిత్ త్రివేదిని పెట్టుకుంటున్నారు. కొరటాల ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నిటికి దేవి మ్యూజిక్ కొట్టాడు. అటువంటి దర్శకుడు కూడా వేరే ఆప్షన్ చూసుకున్నదంటే అది దేవికి ఇబ్బందే.

మహర్షి మ్యూజిక్ కి అంత బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చినా మహేష్ బాబు ఎందుకనో దేవిని పొగడ్తలతో ముంచెత్తాడు. తన తదుపరి చిత్రం సరిలేరు నీకెవ్వరూ సినిమాకి కూడా ఆయనే కావాలని పట్టుబట్టాడు. దీనితో దేవి శ్రీ ప్రసాద్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి మరో అవకాశం దక్కినట్టు అయ్యింది. సంక్రాంతికి విడుదల అయ్యే ఈ సినిమా ఆయనకు చావో రేవో అన్నట్టే. మరోవైపు ఈ సినిమా పాటల కోసం దేవి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్టు సమాచారం

ADVERTISEMENT
Latest Stories