ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించే పేరు అనిరుధ్. తన పాటలతో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఒక ఊపు ఊపుతున్నాడు. దానికి తోడు స్టేజి పెర్ఫార్మన్స్ లతో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అలాగే సినిమాలకు హెల్ప్ అవుతున్నాడు కూడా.
థమన్, దేవి ఇది వరకు స్టేజి పెర్ఫార్మన్స్లు చేసే వారు. అయితే పాటలకు క్రేజ్ వస్తేనే ఈ పెర్ఫార్మన్స్ కూడా వర్క్ అవుట్ అవుతుంది.
ఇటీవలే స్కంద ఫంక్షన్ లో థమన్ స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆ ఒక్క పెర్ఫార్మన్స్ కే నిర్మాతకు 40 లక్షలు ఖర్చు అయ్యిందంట.
మరి సింగర్స్, టెక్నిషన్స్ వూరికే రారు కదా! సినిమా కి ఉపయోగపడిందా అంటే అది కూడా లేదు.
అయితే అనిరుధ్ కి బాగా పేరు రావడం తో థమన్ స్కంద ప్రొడ్యూసర్ కి స్టేజి పెర్ఫార్మన్స్ ఇస్తా అని పట్టుబట్టాడట. ఇక తప్పదు కదా అని 40 లక్షలు క్షవరం చేసుకున్నాడు నిర్మాత.
థమన్ టైమ్ కి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టైమ్ కి ఇస్తే చాలు అంటున్నారు నిర్మాతలు.
థమన్ ని తీసుకుంటే పార్క్ హయత్, ప్రసాద్ ల్యాబ్ బిల్లులు ఎలాగూ ఉంటాయి. పైన ఈ ‘పెర్ఫార్మన్స్’ ఖర్చులు కూడానా అంటూ నిట్టూరుస్తున్నారు నిర్మాతలు.
అయితే పెద్ద గా ఆప్షన్లు లేవు మరి ఇక్కడ.
బోయపాటికి అఖండ కు ప్లస్ అయ్యే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు థమన్… ఈ ఖర్చులు ఎలా ఉన్నా అదే బోయపాటికి అంత కంటే బెటర్ అవుట్ ఫుట్ ఇచ్చి సినిమాకు ప్లస్ అవ్వాలని నిర్మాత కోరుకుంటున్నారు.
ఈ దసరా కు థమన్, అనిరుధ్ ల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వబోతున్నాయి. బాలకృష్ణ భగవంత్ కేసరి, అనిరుద్ లియో… అప్పుడు ఇద్దరు పోటీ పడి థమన్ విన్ అవ్వాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.





