ట్రైలర్ టాక్ – రొమాంటిక్ క్రైమ్ మూవీ!

musugu-trailer-talkబాలీవుడ్ లో “హేట్ స్టోరీ” తరహా చిత్రాలకున్న ఆదరణ తెలియనిది కాదు. బహుశా అలాంటి చిత్రాల నుంచి స్ఫూర్తి పొందారో ఏమో గానీ, తెలుగులో కూడా “ముసుగు” అనే పేరుతో ఓ రొమాంటిక్ క్రైమ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

శృంగార సన్నివేశాలు, ఇన్సిస్టింగ్ భావాలతో కూడిన ఈ సినిమా 10 కోట్ల క్రైమ్ చుట్టూ అల్లుకున్న కధ. బాలీవుడ్ సినిమాల మాదిరే ఈ సినిమాలో నటించిన ముద్దుగుమ్మలు అందాలు ఆరబోసినట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. శ్రీకరబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రినాద్ పంపన, జెస్సీ, పూజశ్రీ వంటి వర్ధమాన నటీనటులు కీలక పాత్రల్లో కనపడనున్నారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల చివర్లో, సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. క్రైమ్ సినిమాలు ఆదరణ చూరగొంటున్న నేటి తరుణంలో “ముసుగు” ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories