బన్నీ ‘వాలైంటైన్స్ గిఫ్ట్’ పండలేదు!

Naa Peru Surya Naa Illu Indiaఏప్రిల్ 26 విడుదల అంటూ ప్రకటించిన “నా పేరు సూర్య” సినిమాకు సంబంధించిన రెండవ పాటను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసారు. ‘సైనిక్’ అనే మొదటి పాట అలరించడంతో ఈ ఆల్బమ్ పై అభిమానులు బాగానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే ‘వాలైంటైన్స్ డే’ సందర్భంగా విడుదల చేసిన రెండవ పాట, ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ‘ఐ యాం లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో…’ అంటూ సాగిన ఈ పాట సంగీత ప్రియులను అలరించ లేకపోయింది.

ADVERTISEMENT

విశాల్ – శేఖర్ ల ద్వయం అందించిన సంగీతం తెలుగు నేటివిటీకి దూరంగా ఉండగా, రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యంలో బన్నీ ఆర్మీ క్యారెక్టర్ కు సంబంధించిన అంశాలు కూడా చొప్పించడంతో… డ్యూయెట్ ఫీల్ ను కలిగించలేకపోయింది. బహుశా బన్నీ వేసే స్టెప్స్ తో సిల్వర్ స్క్రీన్ పైన జనరంజకంగా ఉంటుందేమో ఏప్రిల్ 26వ తేదీన చూడాలి. పబ్లిసిటీలో ముందున్న ‘నా పేరు సూర్య’ ఫిబ్రవరి ప్రమోషన్స్ ఈ పాటతో ముగిసినట్లే! నెక్స్ట్ లుక్ మార్చిలోనే..!

ADVERTISEMENT
Latest Stories