మామకు క్లాప్ కొట్టిన అల్లుడు!

Naga Chaitanya at Subrahmanyapuram Movie Launch‘గోదావరి’ తర్వాత హిట్ అన్న మాట మరిచిపోయి, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ‘సింగిల్ హిట్’ కోసం సిల్వర్ స్క్రీన్ పై దండయాత్ర చేస్తోన్న అక్కినేని కాంపౌండ్ నుండి వచ్చిన సుమంత్ తాజాగా మరో సినిమాను ప్రారంభించారు. ఇటీవల విడుదలైన ‘మళ్ళీ రావా’ చిత్రం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు గానీ, కమర్షియల్ గా సక్సెస్ మాత్రం దరిచేరలేదు. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలే చేస్తున్నప్పటికీ, కావాల్సిన హిట్ రావట్లేదు.

ADVERTISEMENT

ఇలా సాగుతున్న సుమంత్ కెరీర్ 25వ సినిమాకు చేరుకుంది. ఈ ఉగాది సందర్భంగా ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టగా, హీరోహీరోయిన్లపై ఫస్ట్ క్లాప్ తో నాగచైతన్య శ్రీకారం చుట్టారు. “సుబ్రహ్మణ్యపురం” టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుమంత్ సరసన ఈషా హీరోయిన్ గా నటిస్తోండగా, సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లుడు క్లాప్ కొట్టిన ఈ సినిమాతో అయినా మామకు అదృష్టం కలిసి వచ్చి, బొమ్మ బాక్సాఫీస్ దగ్గర హంగామా చేస్తుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories