ఇప్పటివరకు అభిమానులతో, మీడియా వర్గాలతో తన పెళ్లిపై ఆడిన దోబూచులాడిన సమంత, ఇటీవల పూర్తిగా స్పష్టత ఇచ్చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్యతో రిలేషన్ లో ఉన్నానని, పెళ్ళయిన తర్వాత కూడా సినిమాలలో కొనసాగుతానని ఇలా రకరకాల విషయాలు చెప్పుకొచ్చిన సమంత, తాజాగా మరొక విషయంపై కూడా స్పష్టత ఇచ్చింది.
ఈ ఏడాదిలో ఖచ్చితంగా తన వివాహం లేదని చెప్పిన సమంత, అది ఎప్పుడు జరిగినా గానీ, ఓ మూడు నెలల ముందు తెలియజేస్తామని చెప్పుకొచ్చింది. తమ వివాహానికి ఇరు కుటుంబాల ఆశీర్వాదం ఉందని, సినిమాల్లో నటించాలన్న నిర్ణయంపై ఇరు కుటుంబాలు తన నిర్ణయాన్ని గౌరవిస్తాయని, ప్రేక్షకుల ఆదరణ రీత్యా ఎలాంటి సినిమాలలో నిర్ణయించాలనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చింది.
‘ఏం మాయ చేసావే’ నుండి చైతూతో స్నేహం ఉందని, తన అభిప్రాయాలను చైతూ గౌరవిస్తాడని, ఇందులో దాచేందుకు ఏమీ లేదని తెలిపింది. ఇప్పుడంతా ఓపెన్ అయిపోయిన నేపధ్యంలో ఒక్కో విషయాన్నీ నింపాదిగా చెప్తూ వస్తున్నారు. మొత్తానికి అక్కినేని ఇంట పెళ్లిబాజాలు మ్రోగడానికి మూడు నెలల ముందే దాని సౌండింగ్ ఇస్తానని చెప్తోంది సమంత.



