నాగశౌర్యకు నందమూరి ఫాన్స్ కౌంటర్

Naga-Shourya-Chalo-Controversyమొన్నటివరకు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాన హీరో అని ఎన్నో సందర్భాలలో చెప్పిన యువహీరో నాగశౌర్య, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ‘ఛలో’ చిత్రం ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ నెంబర్ 1 అని ప్రశంసించడమే కాకుండా మళ్ళీ జన్మంటూ ఉంటే చిరు అభిమానిగానే పుట్టాలని ఒక్కసారిగా ‘నందమూరి’ నుండి ‘మెగా’ కాంపౌండ్ కు షిఫ్ట్ అయ్యాడు. ఒక పక్క నాగబాబు కూతురు నిహారికతో నాగశౌర్య వివాహం ఖరారైందన్నవార్త సోష‌ల్ మీడియాలో స్వింగ్ అవుతోంది.

ఈ రోజు ‘ఛలో’ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడ లో వున్న కొన్ని కళాశాలలో సందడి చేశారు. సిమ్స్ కళాశాలలో నాగ శౌర్య మాట్లాడుతుండగా కూడా కొందరు విద్యార్థులు ‘జై బాలయ్య’ అంటూ అరిచారు. నాగశౌర్య సోదరుడు వారిని ఉత్సాహ పరచడానికి ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేసి వారిని ఉత్సాహ పరిచిన, నాగశౌర్య మాత్రం జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్, జై అనుష్క అని అంటూ మేమంతా ఒకటే అండీ, మీరంతా ఒకటే అని అక్కడ కవర్ చేసే ప్రయత్నం చేసారు. ఒక అభిమాని తారక్ తో మల్టీ స్టార్రర్ మూవీ మీ బ్యానర్లో చేస్తారా అని అడిగితే, దానికి నాగసౌర్య తారక్ అన్నతో అవకాశం వస్తే 100 సినిమాలు చేస్తా అని బదులిచ్చారు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై వెంకీ కుడుములు దర్శకత్వం లో వస్తున్న ‘ఛలో’ చిత్రం ఫిబ్రవరి 2 వ తేదీన విడుదల కానుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories