నటుడు శివాజీ సినీ తారల డ్రెస్ సెన్స్ గురించి చేసిన వ్యాఖ్యలపై పలువురు తమ అభిప్రాయలు చెపుతున్నారు. తాజాగా నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఆవేశంగా మాట్లడేశారు.
“మన మేల్ డామినేటడ్ సొసైటీలో అందరూ మోరల్ పోలీసులే. అందరూ మహిళలకు చెప్పేవారే. అసలు అలా చెప్పడానికి మనకేమి హక్కు ఉంది? మగావాళ్ళమనే అహంభావంతో ఈవిధంగా మాట్లాడుతున్నాము. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఆలోచించేవాడిని. కానీ క్రమంగా అది తప్పని తెలుసుకున్నాను.
కొంత మంది మహిళలు కూడా అలాంటి వారికి మద్దతుగా మాట్లాడుతుండటం చాలా బాధాకరం. మహిళలు వారికి నచ్చినట్లు బ్రతకనివ్వాలి. వారి రక్షణ సంగతి వారు చూసుకుంటారు. అవసరమైతే రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఉంది,” అంటూ నాగబాబు చాలా ఆవేశంగా మాట్లాడారు.
తన ఈ అభిప్రాయాలపై కూడా మళ్ళీ సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతుందని తనకు తెలుసన్నారు. కానీ ఇలాంటి విషయాలలో తాను మౌనంగా ఉండటం భావ్యం కాదని మాట్లాడానని చెప్పారు.
ఆయన చెప్పినట్లే, అనుకూలంగా కొందరు, వ్యతిరేకిస్తూ కొందరు, ప్రశ్నిస్తూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. రోజాతో కలిసి జబర్దస్త్ రియాల్టీ షోలో పాల్గొన్నప్పుడు, డబుల్ మీనింగ్ డైలాగులతో మహిళలని కించపరిచేలా కామెడీ చేస్తున్నప్పుడు జడ్జి సీటులో కూడా మీకు తప్పనిపించలేదా?
మీ కూతురు అలాంటి పొట్టి బట్టలు వేసుకుంటే చూసి సహించగలరా? మీ సోదరుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పాటించాలని చెపుతుంటే మీరిలా మాట్లాడటం ఏమిటి? మీరు ఆయనకు కొత్త సమస్యలు ఎందుకు సృష్టిస్తున్నారు?అంటూ రకరకాలా కామెంట్స్ పెడుతున్నారు.
సమాజంలో ఎవరి అభిప్రాయలు వారికుంటాయి. కానీ ఆ అభిప్రాయాలపై సమాజానికి ఇంకా అనేక అభిప్రాయాలుంటాయని ఈ చర్చతో మరోసారి రుజువవుతోంది.
వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు. Moral policing is against the Constitution.
Moral policing is unconstitutional in India. Courts have repeatedly held that it violates fundamental rights such as liberty, dignity, privacy, and equality guaranteed under Articles 14, 19, and 21… pic.twitter.com/t927DNMnNV
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 27, 2025



