నాగార్జున అన్వేషణకు ‘శుభం కార్డ్!’

nagarjuna oopiri_ nterview‘కింగ్’ నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వం చేసిన సినిమా దారుణ పరాజయాన్ని చవిచూడడంతో రెండవ సినిమాపై మరింత దృష్టి పెట్టారు. ఈ సారి అఖిల్ ఎలాగైనా బంపర్ హిట్ కొట్టాలని మంచి కధల కోసం నాగ్ చేసిన అన్వేషణ దాదాపుగా పూర్తి కావచ్చిందని, “ఊపిరి” సినిమా విడుదలైన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని టాలీవుడ్ టాక్.

‘ఊపిరి’ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సొంత నిర్మాణ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగ్ ఈ సినిమాను నిర్మించాలని సంకల్పించారట. నిజానికి తొలి సినిమానే అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మించాల్సి ఉన్నప్పటికీ, నితిన్ కు ఆ బాధ్యతను అప్పగించారు. అయితే మరోసారి పొరపాటుకు ఆస్కారం లేకుండా… ఖచ్చితంగా హిట్ కొట్టే కధకు నాగ్ ఓకే చేసారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ADVERTISEMENT

ఇటీవల కాలంలో అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మించిన ప్రతి సినిమా ఘనవిజయం సాధించింది. ‘మనం’ చిత్రంతో మొదలైన ఈ విజయపరంపర “సోగ్గాడే చిన్నినాయనా” వరకు దిగ్విజయంగా సాగింది. దీంతో అఖిల్ నటించబోయే రెండవ సినిమా కూడా ఆ కోవలోనే చేరుతుందని అక్కినేని అభిమానులు ఆశగా ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories