ఏఎన్నార్, నాగ్ చెప్పిన ఆ రెండు మాటలు మత్తెక్కించేవి!

Nagarjuna ANR - WIth Writter J K Bharaviనాగార్జున సినిమాలు అంటే తనకు బాగా ఇష్టమని, ఆయన నటించిన సినిమాలు ఏవీ చూడకుండా వదిలి పెట్టలేదని ‘ఓం నమో వేంకటేశాయ’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ రచయిత జె.కె. భారవి అన్నారు. ‘అన్నమయ్య’ సినిమాతో నాగార్జునతో నాకు అనుబంధం ఏర్పడింది. నా జీవితంలో నాకు ఒక ఆస్కార్ అవార్డు ఇచ్చినా కూడా అంత సంతోషం కలగని రెండు గౌరవాలు నాకు దక్కాయని ఎంతో సంతోషంగా చెప్పుకొచ్చారు.

ఒకటి… ‘ఎప్పుడు మిమ్మల్ని చూసినా హగ్ చేసుకోవాలనిపిస్తుందని’ నాగార్జున గారు నాతో గతంలో అన్నారు. ఆ మాటలు ఇప్పుడు తలచుకున్నా నా కళ్లలో నీళ్లు వచ్చేంత ఆనందం. రెండోది… ‘అన్నమయ్య’ సినిమా చూసిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను హగ్ చేసుకుని ‘నాగార్జున నా కొడుకే అని నువ్వు ప్రూవ్ చేశావ్’ అని అన్నారు. ఈ రెండు మత్తులు నాకు ఎక్కిపోయాయి. ‘ఆ రెండూ ఎప్పుడూ దిగని మత్తులు…’ అని తన భావాలను పంచుకున్నారు భారవి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories