వర్మ ట్వీట్లపై స్పందించిన టాలీవుడ్ టాప్ హీరో!

Nagarjuna Comments On Ram Gopal Varmaతన ట్వీట్లతో వేడి పుట్టించడం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అత్యంత ఇష్టమైన పని అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీపై వర్మ సంధించే ట్వీట్లు మెగా కాంపౌండ్ కు ఏ విధమైన మంట పుట్టిస్తాయో… ఇటీవల నాగబాబు, చిరంజీవిలు స్పందించిన తీరు చూస్తే అర్ధమవుతుంది. మెగా హీరోలను మొదలుపెట్టుకుని, వివాదాలకు దూరంగా ఉండే మహేష్ బాబు వరకు ఎవరినీ వదలకుండా ట్వీట్ చేసే వర్మపై, అభిమానులు అనేకసార్లు మండిపడినా, వర్మ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వర్మ చేసే ట్వీట్లపై కింగ్ నాగార్జున స్పందించాడు. రాంగోపాల్ వర్మపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని… కానీ తనకు మాత్రం వర్మ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. వర్మపై తనకు అంతులేని ప్రేమ ఉందని, ఆ ప్రేమ ఎన్నటికీ చావదని అన్నాడు. మనసులో ఏది ఉంటే దాన్ని బయటకు చెప్పేయడం వర్మకు అలవాటని… అదే వర్మ ఎప్పుడూ పాటిస్తారని… ఆ ట్వీట్ల గురించి బాధపడుతున్నవారు, వాటిని పట్టించుకోకపోవడమే మేలని హితవు పలికాడు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories