బాలయ్య… నీకు సాటి ఎవరయ్యా..!

Nandamuri Balakrishna about okka magadu movieతన సినిమాలపై తానే జోకులు వేసుకోవడంలో బహుశా నందమూరి నటసింహం బాలకృష్ణను మించిన మరో తెలుగు హీరో ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమాలో ‘తొడకొడితే రైలు వెనక్కి వెళ్ళిపోయే సీన్’పై స్వయంగా బాలయ్యే సెటైర్లు వేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బాలయ్య పాల్గొన్న ‘నెంబర్ 1 యారి విత్ రానా’ కార్యక్రమంలో ‘ఒక్క మగాడు’ సినిమా చేయకుండా ఉండాల్సిందన్న భావనను వ్యక్తపరిచారు.

‘ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా?’ అంటూ రానా ప్రశ్నించగా… “కమల్ హాసన్ గారు చేసిన తర్వాత నేను మళ్ళీ అలానే గెటప్ వేసుకుని చేయకుండా ఉండాల్సింది అని అనిపించినా సినిమా ఒక్క మగాడు” అంటూ బదులిచ్చారు బాలయ్య. ఇంత బోళాశంకరుడు కాబట్టే నందమూరి అభిమానులకు బాలయ్య అంటే ఓ పిచ్చి. ఇతర హీరోలకు కూడా ఇలాంటి అనుభూతులు లేకుండా ఉండవు, కానీ బాలయ్య మాదిరి ఇలా ఓపెన్ గా చెప్పే హీరోలు మాత్రం బహు అరుదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories