
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించాయి. వరుస బ్లాక్ బాస్టర్ సాధించి హ్యాట్రిక్ విజయాలను సొంత చేసుకున్న ఈ హిట్ కాంబోలో ఇప్పుడు 4 వ సినిమాగా అఖండ -2 రూపొందుతుంది.
Also Read – హాజరు కోసమే కేసీఆర్ వచ్చారట!
నేడు అఖండ-2 మూవీ కి గాను చిత్ర యూనిట్ పూజ కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు బోయపాటితో పాటుగా హీరోహిన్ ప్రేగ్య జేశ్వాల్, బాలకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి ముహూర్తం షాట్ కు తొలి క్లాప్ కొట్టగా బాలయ్య “అఖండ తాండవం” అంటూ తొలి డైలాగ్ చెప్పారు.
అయితే ఇప్పుడు తెలుగు సినిమా తన పరిధిని పెంచుకుంటూ టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అఖండ -2 పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతుంది. దీనికి ముందు వచ్చిన అఖండ మూవీ కూడా హిందీ భాషలో విడుదలైనప్పటి తెలుగు వర్షన్ తో పోలిస్తే ఒక నెలరోజులు ఆలస్యం అయ్యింది.
Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?
దీనితో ఇటు తెలుగు లో వచ్చినంత కలెక్షన్లు బాలీవుడ్ లో రాబట్టుకోలేకపోయింది అఖండ. హిందుత్వ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీగా వచ్చిన అఖండ -1 బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇప్పటికే ఆహాలో వచ్చే అన్ స్టాపబుల్ టాక్ షో తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు బాలకృష్ణ.
ఇక అఖండ -2 పాన్ ఇండియా స్థాయిలో మంచి టాక్ సంపాధించుకోగలిగితే ఇప్పుడున్న కుర్ర హీరోల సినిమాలకు ధీటుగా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వేట కొనసాగించడంలో ఎటువంటి సందేహం లేదు. కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే మూవీ లో స్టార్స్ తో పనిలేదని నిరూపించింది జై హనుమాన్.