నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్ మూవీ ‘డిక్టేటర్’. అందాల ముద్దుగుమ్మలు అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘లౌక్యం’ ఫేం శ్రీవాస్ దర్శకుడు. ఎస్.ఎస్.థమన్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సినీ ప్రముఖులు, అశేష అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకను పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో జరుగనున్న తొలి ఆడియో వేడుక కావడంతో చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో 99 వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారని సమాచారం. భారీ స్తాయిలో తలపెట్టిన ఈ ఆడియో వేడుక ‘అమరావతి’లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో క్లయిమాక్స్ ఫైట్ ను భారీ లెవల్లో చిత్రీకరిస్తున్నారు. మరో వైపు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ హంగులు పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా “డిక్టేటర్”ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.





