ఏడాది పాటు కోవిడ్ కారణంగా ఇబ్బంది పడిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి ఊపు మీదకు వచ్చింది. ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీ లో లేని సందడి ఇక్కడ కనిపిస్తుంది. సంక్రాంతి సినిమాలకు ఆదరణ అదిరిపోగా… ఫిబ్రవరి లో చిన్న సినిమాల హవా ఉండనుంది. మార్చి నుండి మొదలుకొని అనేక పెద్ద సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు, చెప్పుకోదగ్గ చిన్న సినిమాలు వస్తూనే ఉంటాయి.
మార్చి మొదలుకొని వచ్చే సంక్రాంతి వరకు సినిమాలు ప్రకటించుకుంటూ పోతున్నారు. అసలు రేపు అనేది ఉండదేమో అన్నట్టు ఉంది గత రెండు మూడు రోజులుగా వరుసగా సినిమా రిలీజ్ డేట్లు ప్రకటిస్తూనే పోతున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఏప్రిల్ 6న, రవితేజ ఖిలాడీ మే 28న, శర్వానంద్ మహాసముద్రం ఆగష్టు 19న విడుదల చెయ్యనున్నట్టు ఈ రోజు ప్రకటించారు.
ఎవరో కొందరు హీరోలు తప్ప అన్ని క్యాంపులలో కోలాహలం కనిపిస్తుంది. ప్రభాస్, అఖిల్, నాగార్జున, బాలయ్య సినిమాల అప్డేట్ మాత్రం రాలేదు. నాగార్జున వైల్డ్ డాగ్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రభాస్ రాధే శ్యామ్ ప్రకటన ఫిబ్రవరి 14న టీజర్ తో ప్రకటించనున్నారని అంటున్నారు. సో ప్రాబ్లెమ్ లేదు.
ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ గీతా ఆర్ట్స్ సినిమా. సో ఎప్పుడు ప్రకటించినా మంచి డేట్ చూసుకునే ప్రకటిస్తారు. ఇక ఎటు తిరిగి బాలయ్య అభిమానుల పరిస్థితే ఎటు అర్ధం కాకుండా ఉంది. బాలయ్య కు మామూలుగానే ఇటువంటి ప్లాన్నింగ్ ఉండదు. ఇక ప్రకటన వస్తుందనే నమ్మకం లేదు అని ఢీలా పడిపోయారు. అది కాకుండా మంచి డేట్లు అన్నీ అయిపోతాయేమో అని ఇంకో భయం.





