బాలయ్య వల్ల కాపులు టీడీపీకి దూరం అవుతున్నారు అనేదాంట్లో నిజమెంత?

nandamuri-balakrishna TDP Kapu Communityబాలయ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై చేసిన కామెంట్లకు నాగబాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇండస్ట్రీ గొడవ కింద మొదలైన ఈ ఇష్యూ ఆ తరువాత తెలుగుదేశం పార్టీ మీదకు వెళ్ళింది. 2024లో వైఎస్సార్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడమో, జనసేన బీజేపీ రావడమో జరుగుతుంది గానీ తెలుగుదేశం మాత్రం రాదని నాగబాబు చెప్పుకొచ్చాడు.

ADVERTISEMENT

దీనితో ఈ విషయం తీవ్రతరం అయ్యింది. కొందరు బాలయ్య వల్ల కాపు కులస్థులు టీడీపీకి దూరం అవుతారు అని అంటున్నారు. అయితే అది వట్టి మాట అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “2009, 2019లలో అటు ప్రజారాజ్యం పార్టీకి కానీ ఇటు జనసేనకు గానీ గంపగుత్తుగా కాపుల ఓట్లు పడలేదు. అదే నిదర్శనం,” అని వారు అంటున్నారు

“2019 ఎన్నికల సమయంలో జగన్ ప్రచారం సందర్భంగా పవన్ కళ్యాణ్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు నలుగురు భార్యలని ఇంకా ఏవేవో మాట్లాడారు. అయినా సరే కాపుల ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్ కు పడ్డాయి. చిరంజీవిని అంటేనో, పవన్ కళ్యాణ్ కి అంటేనో కాపులు ఓట్లు వెయ్యరు అనుకోవడం అవివేకం,” అని వారి అభిప్రాయం.

ఇటువంటి లెక్కలు వెయ్యడం కాపుల రాజకీయ పరిణితిని అవమానించడమే. ఇది ఇలా ఉండగా… ఇండస్ట్రీలో కరోనా కారణంగా సంక్షోభం ఏర్పడిన ఈ తరుణంలో ఇరు వైపుల వారు సమన్వయం పాటించడం ఎంతో అవసరం. అయితే ఇప్పటికి ఆ వివాదం సర్దుమణిగినట్టే అని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories