గడిచిన మూడు, నాలుగేళ్ళల్లో ‘కృష్ణార్జున యుద్ధం’ మినహా అన్ని సక్సెస్ లతో ఉన్న నాచురల్ స్టార్ నాని కెరీర్ మరో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు నాచురల్ స్టార్ గా నటించిన నాని, ఇక నుండి నాచురల్ గా స్పందించాలి. విడుదల చేసిన ప్రోమోలో ‘బాబాయ్ ఈ సారి ఇంకొంచెం మసాలా’ అంటూ ‘బిగ్ బాస్’ సీజన్ లో 2లో ఉండబోతోందో నాని పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
బిగ్ బాస్ అంటేనే సాధారణంగా మసాలాలతో నిండి ఉంటుంది. కానీ తెలుగు ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్ అంతా జూనియర్ ఎన్టీఆర్ తో కొట్టుకుపోయింది తప్ప, హౌస్ లో జరిగిన మసాలాలు లేవు. కానీ ఈ సీజన్ లో అలాంటి వాటికి కొదవుండదని నాని వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అవి హద్దులు దాటే విధంగా ఉంటాయా? లేక పరిమితంగా ఉంటాయన్నది వేచిచూడాల్సిన విషయం.
ఒకవేళ హద్దులు దాటితే చాలా మంది మనోభావాలు దెబ్బతిని ఫైనల్ గా ‘బిగ్ బాస్’కు కావలసినంత పబ్లిసిటీ వచ్చి చేరుతుంది. హౌస్ లో వస్తున్న పార్టిసిపెంట్స్ జాబితాను పరిశీలిస్తే… ఈ సారి యువ హృదయాలకు కన్నుల పండగేనని అర్ధమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన టీఆర్పీని నాని అందుకుంటాడా? లేదా? అనేది కూడా గమనించదగ్గ అంశమే.



