
ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్లలో కూడా కొత్తదనాన్ని అందిస్తున్న దర్శక నిర్మాతలు, హీరోలు ఏదోఒక విధంగా తమ సినిమా ప్రజల మధ్య చర్చ జరగాలనే భావిస్తున్నారు.ఒక్కో సారి అది ఆసినిమా విజయానికి ప్లస్ గా మారుతుంటే ఒక్కో సందర్భంలో అదే నెగటివ్ టాక్ ను తెచ్చిపెడుతుంది.
ఈ మధ్యకాలంలో పవన్ నటించిన ‘బ్రో’ సినిమాకు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి గారు చేసిన ప్రమోషన్స్ ఆ సినిమా పట్ల ప్రజలలో చర్చ జరిగేలా చేసి ఆ సినిమాకు కొంత వ్యూస్ పెరిగేలా చేసింది. అలాగే వివాదాలు దర్శకుడిగా పేరుపొందిన ఆర్జీవీ ప్రమోషన్లను సృష్టించుకుని దానికి అనుగుణంగా సినిమా కథ తెరకెక్కిస్తారు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. చివరికి ప్రమోషన్ల ఖర్చులు కూడా రాబట్టుకుంటారా? అనేది కూడా సందేహమే.
అయితే ప్రస్తుత విషయానికి వస్తే..,న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న.! సినిమా ప్రమోషన్ల కోసం ఆయన ఒక కొత్త విధానంతో ప్రజలు ముందుకొచ్చారు.ప్రత్యర్థుల పై విరుచుకుపడడానికి ప్రెస్ మీట్లకు వచ్చే రాజకీయ నాయకుడి అవతారంలో ఒక వీడియో విడుదల రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ప్రెస్ మీట్ కు వచ్చి రాగానే ఎమ్మా అందరు వచ్చినట్టేగా నేషనల్ జియోగ్రాఫిక్ , కార్టూన్ నెట్ వర్క్, యానిమల్ ప్లానెట్…ఆడేడి..పోగో రాలేదా? ఆడు,హెచ్ బివో మన పార్టీ అంటే చాలు అంటూ మొదలు పెట్టిన నాని రాజకీయ నాయకులు తమ పార్టీ గెలుపు కోసం ప్రజలకు ఇచ్చే హామీల మాదిరి ప్రసగంతో వీడియో ఆద్యంతం చూస్తున్న ప్రేక్షకుడికి వినోదాన్ని అందించారు. దీనితో హాయ్ “పోగో”…తో ట్రేండింగ్ లో ఉన్నహాయ్ “నాన్న”!అంటూ ఈ వీడియో ను షేర్ చేస్తున్నారు.
నన్ను గాన పదవిలో కూర్చోబెడితే ప్రతి జంక్షన్ లో నా బొమ్మ ఉండేలా చూస్తా!,అలాగే అందరి ఆదాయం పెరిగేలా చూస్తాం థియేటర్ల ఆదాయం, ఆ పక్కనే ఉన్నా కిరాణా కొట్ల ఆదాయం, ఆ పైనా సబ్జెక్టు, టాపిక్ తెలియకుండా ఇష్టమొచ్చినట్టు వాగే వారి ఆదాయం కూడా పెంచుతాం అంటూ ఎవరికో తగిలేలా, ఎక్కడో మండేలా చేసిన నాని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గతంలో కూడా సినిమా టికెట్ల పంచాయితీలో వైసీపీ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన నాని దానికి మూల్యం కూడా చెల్లించుకున్నారు. అయితే ఇప్పుడు తన కొత్త సినిమా హాయ్ నాన్న! ప్రమోషన్ లో భాగంగా నాని చేసిన ఈ వీడియో కూడా ఒక రాజకీయ నాయకుడిని గుర్తు చేస్తూ ఓ రాజకీయ పార్టీకి తగిలేలా ఉన్నాయంటున్నారు. అలాగే ఈ వీడియోలో ‘పోగో’..ఛానెల్ అంటూ ‘సాక్ష్యా’త్తు ఓ పిల్లల ఛానెల్ ను కూడా ప్రమోట్ చేశారు నాని. ఈ సినిమాలో కూడా పిల్లదే కీలక పాత్ర కాబోతుందేమో.
రిలీజ్ దెగ్గరలో ఉంది.
ఎలక్షన్స్ మధ్యలో వున్నాయి.వాడేయటమే 😉
Manifesto లు అంటే నోటికొచ్చింది చెప్పేస్తున్నారు అందరూ.
నేనూ ఒక రాయి ఏసా
మీ vote #HiNanna ke #HiNannaOnDec7th pic.twitter.com/zOsy2nVFA5— Nani (@NameisNani) November 18, 2023