నాని గాడి గాధ గురించి ప్రేక్షకులు ఏమంటున్నారు?

Nani Krishnagadi Veera Prema Gadha  public talkఈ ఏడాది తెలుగు సినిమా దశ తిరిగినట్లుగా కనపడుతోంది. జనవరి 1వ తేదీన “నేను.. శైలజ…” సినిమాతో మొదలైన గుడ్ ఓపెనింగ్ కు సంక్రాంతి సినిమాలు మరింత ఊపునిచ్చాయి. అయితే ఆ తర్వాత విడుదలైన సినిమాలు అంతగా జనరంజకంగా లేకపోయినప్పటికీ, అవేమీ భారీ బడ్జెట్ సినిమాలు కాకపోవడంతో భారీ నష్టాలను చవిచూడలేదు. మొత్తమ్మీద జనవరి నెల మొత్తానికి “సోగ్గాడే చిన్నినాయనా” సినిమా ‘బ్లాక్ బస్టర్’ జాబితాలోకి చేరుకుంది.

ఇక, ఫిబ్రవరి తొలివారంలో విడుదలైన “స్పీడున్నోడు” సత్తా చాటలేక నిరుత్సాహపరచడంతో, తెలుగు సినిమాకు మళ్ళీ కొంత ఊపు తగ్గినట్లయ్యింది. అయితే, మరో వారం తిరిగే లోపే నాని “కృష్ణగాడి వీరప్రేమగాధ” ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వచ్చి రావడంతోనే అందరి దగ్గర నుండి ప్రశంసలు అందుకుంటూ సినిమాకు ఒకే ఒక టాక్ ను తీసుకువచ్చాడు.

ADVERTISEMENT

దాదాపుగా రెండున్నర్ర గంటలు ఉన్న ఈ వీరగాధను చవిచూడడానికి ప్రేక్షకులు కూడా ధియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా నాని కెరీర్ లో మరో “బ్లాక్ బస్టర్” హిట్ ఖాయమన్న సంకేతాలు వచ్చేసాయి. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగిన థ్రిల్లింగ్ కధనం ప్రేక్షకులను కట్టిపడేసిందన్న టాక్ సర్వత్రా వెలువడుతోంది.

జోరుగా సాగిన ఫస్టాఫ్, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ల గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సెకండాఫ్ రక్తికట్టించారనే పబ్లిక్ టాక్ తో ఈ ఫిబ్రవరి “బ్లాక్ బస్టర్” నాని గాడి వీర గాధ అని ఫిక్స్ అయిపోయారు. ఈ నెలలో మరో పెద్ద సినిమా కూడా లేకపోవడం నానికి సానుకూల అంశం. ‘పిల్ల జమీందార్’ తర్వాత ఆ రేంజ్ మాస్ అప్పీల్ లో నాని ఇరగదీసాడన్న టాక్, బహుశా నాని కెరీర్ లోనే నెంబర్ “1” చిత్రంగా నిలిచే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories