“నాన్నకు ప్రేమతో” పాటల జాబితా ఇదే!

Nannaku Prematha songs listయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న “నాన్నకు ప్రేమతో” ఆడియో ఈ నెల 27వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. సుకుమార్ – దేవిశ్రీ కాంభినేషన్ లో రూపుదిద్దుకున్న ఈ ఆడియో పై భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే దేవి – జూనియర్ కలయికలో వచ్చిన చిత్రాలు కూడా ఆడియో పరంగా ప్రేక్షకుల నుండి మంచి మార్కులనే పొందాయి. ఈ తరుణంలో ఈ ముగ్గురి కాంభినేషన్ ఇంకెంతటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మొత్తం అయిదు పాటలున్న ఈ ‘ఆల్బం’లో రెండు పాటల మ్యూజిక్ ఇప్పటికే సంగీత ప్రియుల మద్దతు పొందింది. ‘ఫాలో ఫాలో…’ అంటూ తొలి టీజర్ తో దేవి ఇచ్చిన సంగీతం ప్రజాదరణ పొందింది. అలాగే ఇటీవల లీకైన ‘నా మనసు నీలో…’ పాట ఆడియోపై ‘హైప్’ పెంచింది. ‘జంగీల్’ ద్వారా విడుదల కానున్న “నాన్నకు ప్రేమతో” 5 పాటల ఆల్బమ్…
1) ఫాలో ఫాలో

2) నా మనసు నీలో

3) డోంట్ స్టాప్

4) లవ్ మీ ఎగైన్

5) లవ్ దెబ్బ

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories