జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఫస్ట్! టార్గెట్ ఫిక్స్!

nannaku-prematho-collections-career-best-for-ntr“నాన్నకు ప్రేమతో” సినిమాలో దర్శకుడు సుకుమార్ చేసిన ‘మ్యాజిక్’ ఓవర్సీస్ లో వర్కౌట్ అయ్యింది. ప్రీమియర్స్ తో కలుపుకుని తొలి నాలుగు రోజులకు గానూ 13,37,354 డాలర్స్ వసూలు చేసి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంతకుముందు 1.23 లక్షల డాలర్స్ తో ప్రధమ స్థానంలో ఉన్న శ్రీనువైట్ల “బాద్ షా” రెండవ స్థానానికి జరగగా, పూరీ “టెంపర్” 1.05 లక్షల డాలర్స్ తో మూడవ స్థానంలో నిలిచింది.

శనివారం నాడు కూడా “నాన్నకు ప్రేమతో” సినిమాకు భారీ సంఖ్యలో వసూళ్ళు రావడంతో 2 మిలియన్ క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆదివారం నాటికి 1.50 సంఖ్యను దాటనుండగా, వచ్చే వీకెండ్ సమయానికి 2 మిలియన్ క్లబ్ లో చేరవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. అదే జరిగితే, “బాహుబలి, శ్రీమంతుడు” తర్వాత స్థానాన్ని “నాన్నకు ప్రేమతో” సొంతం చేసుకుని, పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది” సినిమాను వెనక్కి నెట్టడం ఖాయం.

ADVERTISEMENT

ఓవర్సీస్ లో బ్రహ్మరథం పట్టిన ఈ సినిమాకు ఏపీ, తెలంగాణాలలో మాత్రం ఆదరణ ఆశించిన స్థాయిలో రావడం లేదు. తొలి రోజు వసూళ్ల (12.33 కోట్ల)ను పక్కన పెడితే, మిగిలిన మూడు రోజుల్లో సెలవుల కారణంగానే (7.10 కోట్లు) అంతంత మాత్రపు వసూళ్ళు ఉంటే, సాధారణ రోజుల్లో పరిస్థితి ఏమిటో, ఈ సోమవారం నాడు తేలిపోనుంది.

ADVERTISEMENT
Latest Stories