8 పైసల కోసం ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసానంటూ విడుదల చేసిన ‘ప్రతినిధి’ ప్రోమో వీక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ‘ప్రతినిధి’ సినిమా రిజల్ట్ కూడా తెలిసిందే. ఇప్పుడే అదే రచయిత ఆనంద్ రవి స్వీయ దర్శకత్వ నటన నుండి “నెపోలియన్” అనే సినిమా రాబోతోంది. ‘నా నీడ పోయింది’ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన టీజర్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన ‘నెపోలియన్,’ తాజాగా ధియేటిరికల్ ట్రైలర్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు.
ఆ టీజర్ కు కొనసాగింపుగా విడుదలైన ఈ ట్రైలర్ వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే… ‘ఇలాంటి కొత్తదనమే కదా తెలుగు ప్రేక్షకులు కోరుకుంటోంది’ అనిపించేలా ఈ ట్రైలర్ ఉంది. పర్ ఫెక్ట్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ లో సిద్ధార్ద్ సంగీతం, మార్గాల్ డేవిడ్ ఫోటోగ్రఫీ, ఆనంద్ రవి డైలాగ్స్ అదిరిపోయాయని చెప్పాలి. ఇక తారాగణం అంతా చాలా సహజంగా నటించినట్లుగా స్పష్టమవుతోంది. అంతలా ఆకట్టుకుంటున్న ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి..!


