బులుగు మీడియా పద్దతే వేరు… వారికి ఏ విషయం దొరికినా దానిని ఎలా కావాలంటే అలా అనువుగా మార్చుకుని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ మీద ఏడుస్తారు. తాజాగా వారికి చంద్రబాబు అరెస్టు కోతి చేతికి కొబ్బరికాయ దొరికినట్టు అయ్యింది.
చంద్రబాబు అరెస్టు సమయంలో మొన్న అవినాష్ రెడ్డి లాగా అమ్మకి బాలేదని ఇంకోటని వంకలు పెట్టకుండా పూర్తిగా సిఐడీకి కో-ఆపరేట్ చేశారు. ఇక జగన్ అరెస్టు అయినప్పుడు రోడ్డు మీద కూర్చుని విజయలక్ష్మి, షర్మిల, భారతి చేసిన సెంటిమెంట్ హై డ్రామాలా నటన భువనేశ్వరికి గానీ బ్రాహ్మణికి గానీ కుదరలేదు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు భువనేశ్వరి ఎమోషనల్ అయ్యి ఏడ్చేసారట. ఆ వీడియో రిలీజ్ చేసి సింపతీ పొందాలని ట్రై చెయ్యలేదు తెలుగుదేశం పార్టీ.
ఇలా చెప్పడానికి మనసు ఒప్పదు బులుగు మీడియాకి అలా అని కుదురుగా కూడా ఉండరుగా.
జగన్ అరెస్టయినప్పుడు విజయలక్ష్మి, షర్మిల, భారతి దేశాన్ని కదిలించారు, తెలంగాణాలో షర్మిల అరెస్టయినప్పుడు విజయలక్ష్మి అండగా నిలిచారు. అయితే నందమూరి, నారా కుటుంబాలలో మాత్రం అంత మంది ఉన్నా ఒక్కరు కూడా బాబుకు మద్దతుగా నిలవలేదు అని సదరు కుల మీడియా మొసలి కన్నీరు.
నిజమే నారా, నందమూరి కుటుంబాలకు డ్రామా రాకపోయింది. రాజకీయ లబ్ది కోసం రోడ్డెక్కడం రాకపోయింది. నందమూరి ఫ్యామిలీలో నటులు ఉన్నా పెద్ద తెర మీద రక్తి కట్టించగలరు గానీ నిజ జీవితంలో పాపం చాలా పూర్ ఆర్టిస్టులు. పాపం వారి వల్ల కాలేదు.
సరే అంతటి మమతల పందిరి అయినటువంటి వైఎస్ కుటుంబం… ఇప్పుడు ఎందుకు ముక్కలైనట్టు? అన్న పాలనలో చల్లగా ఉండాల్సిన షర్మిళ తెలంగాణలో ఎందుకు తిరుగుతున్నట్టు? విజయలక్ష్మి ని ఎవరు పార్టీకి రాజీనామా చేయించినట్టు?
సొంత బాబాయ్ హత్య కేసులో అబ్బాయి ఎందుకు A8 గా ఉన్నట్టు?
అయినా అదంతా వారి పర్సనల్ కాకపోతే బులుగు మీడియాకి అర్ధమయ్యే భాష ఇదే!



