బాలయ్య… లోకేష్… ఓ కనపడని స్వీట్ ముక్క..!

nara lokesh cake to nandamuri balakrishnaనందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను “గౌతమీపుత్రశాతకర్ణి” ఫస్ట్ లుక్ తో అభిమానులు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూలు కట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ తన మావయ్యకు స్వీట్ పెడుతూ శుభాకాంక్షలు తెలిపారు.

ADVERTISEMENT

“విలక్షణ నటుడు, ప్రేమను పంచే తండ్రి, మా లెజెండ్ బాలయ్య మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు” చెప్తూ… బాలయ్యకు స్వీట్ తినిపిస్తున్న ఓ ఫోటోను షేర్ చేసుకున్నాడు నారా లోకేష్. అయితే ఈ ఫోటోను ఫస్ట్ లుక్ లో చూసిన వారికి నారా లోకేష్ స్వీట్ పెడుతున్నట్లు… దానికి తీసుకోవడానికి బాలయ్య నోరు తెరిచినట్లు కనపడుతుంది గానీ… సదరు స్వీట్ ముక్క మాత్రం కనపడదు.

దీంతో అవాక్కైన వీక్షకులు మళ్ళీ మళ్ళీ తీక్షణంగా చూస్తే గానీ కనపడదు… బ్రౌన్ కలర్ లో ఉన్న ఓ స్వీట్ ను లోకేష్ తన మావయ్య బాలయ్యకు తినిపిస్తున్నారని! ఈ సందర్భంగా లోకేష్ తండ్రి, బాలయ్య వియ్యంకుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఓ ట్వీట్ చేసారు.

ADVERTISEMENT
Latest Stories