జాంబీ రెడ్డిగా మారిన జగన్ రెడ్డి

nara lokesh comments about ys jaganతెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ ఉత్సాహంగా తిరుపతి ఉపఎన్నికల ప్రచారం చేశారు. దానిని ముగించుకుని తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, రామవరం గ్రామంలో కేసులు, అరెస్టులకు గురైన టీడీపీ నాయకుడు..మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించాడు లోకేష్. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ జగన్ పై విరుచుకుపడ్డారు.

జ‌గన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అని మార్చేశా అని చెప్పుకొచ్చారు.. సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుంది.. కానీ, జాంబీ రెడ్డి.. టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నార‌ని మండిప‌డ్డారు. జాంబీలు చుటుపక్కన వారిని కరిచి చంపేస్తాయి… వాళ్ళను కూడా జాంబీలుగా మార్చేస్తాయి. ఇప్పుడు జగన్ రెడ్డి కూడా అదే పనిలో ఉన్నారు.

ADVERTISEMENT

మా పార్టీ వారిపై కేసులు, అరెస్టులు టీవీల్లో చూసి తాడేపల్లి ఇంట్లో జాంబీ రెడ్డి తొడ కొట్టుకుంటార‌నంటూ సెటైర్లు వేశారు. కేవలం స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టారనే రామకృష్ణారెడ్డిని అక్రమ అరెస్టు చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అక్రమ కేసులతో తమ పార్టీ నాయకులను, క్యాడర్ ను ఇబ్బంది పెట్టేవారి అందరి పేర్లు సిద్ధంగా ఉన్నాయని… తాము అధికారంలోకి రాగానే వారు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. “నా పై కేసులు పెట్టండి బరిస్తా… నన్ను అరెస్ట్ చేయండి బాధ‌ప‌డ‌ను.. మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తా… మర్చిపోయే ప్రసక్తే లేదు,” అంటూ లోకేష్ అధికార పార్టీకి వార్నింగ్ ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories