తమ అధినేత హస్తిన వెళ్లి రాష్ట్రానికి ఏం సాధించుకొచ్చారో చెప్పలేని నీలి మీడియా పక్క పార్టీల నేతలు ఢిల్లీకి వెళితే మాత్రం అక్కడ వారేం ఏం చేస్తారో, ఏం మాట్లాడుతారో, ఆ మాయేమిటో కానీ యిట్టె చెప్పేస్తారు.గతంలో చంద్రబాబు ఢిల్లీకి వెళితే ప్రత్యేక హోదాను తాక్కట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ కు ఒప్పుకుని కేంద్ర పెద్దల నుండి బాబు లబ్ది పొందుతున్నారని, వ్యక్తిగత లాభం కోసం రాష్ట్ర క్షేమాన్ని గాలికొదిలేసాడని బ్లూ మీడియా ఛానల్స్ కథనాలు ప్రచారం చేసేవారు.
తాజాగా బాబు అరెస్టు నేపథ్యంలో న్యాయ సలహాలు తీసుకోవడానికి, న్యాయవాదులతో చర్చలు జరపడానికి, ఇతర పార్టీల మద్దతు కూడగట్టడానికి, మద్దతిచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు తెలియచేయడానికి హస్తినకు వెళ్లిన లోకేష్ ను ఉద్దేశించి తండ్రి అరెస్టుతో భయపడి పార్టీని, ఆ పార్టీ నేతలను విడిచి ఢిల్లీ పారిపోయాడని, బాబుని విడిపించడానికి కేంద్ర పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి లోకేష్ సిద్ధపడ్డాడు అంటూ సదరు మీడియా సంస్థలు కథనాలు రాసుకొచ్చారు.
అయితే వాటికీ అంతే ఘాటుగా లోకేష్ కూడా సమాధానం చెప్పాడనుకోండి. ఏది పడితే అది రాసే మీ మీడియా యాజమాన్యానికి దమ్ము ధైర్యం ఉంటే సూటిగా ప్రశ్నలు అడగమనండి, నేను ఎక్కడికి పారిపోలేదు బ్రదర్ అంటూ ధీటైన జవాబిచ్చారు లోకేష్. అలాగే సాక్షి లేదామ్మా, నన్ను ప్రశ్నలు వేయడం కాదు బ్రదర్ మీ అధినేతను ఒక్క ప్రెస్ మీట్ అయినా పెట్టమని చెప్పగలవా? అంటూ ఎదురుప్రశ్నలు వేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాలేదు మరి ఇప్పుడు ఏ ప్యాకేజ్ కు ఒప్పుకుని జగన్ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారో కూడా సదరు మీడియా సంస్థలు ప్రజలకు వివరిస్తే తెలుసుకుంటారు.ఎవరి కాళ్ళు పట్టుకుంటే జగన్ కు పది సంవత్సరాలు బెయిలు దొరికిందో కూడా కాస్త నీలి మీడియా చూసి చెపితే బాగుండేది.ఒక్క ప్రతిపక్ష నేతలు హస్తినకు వెళితేనే ఆ మీడియా వర్గాలకు కళ్లు, చెవులు పనిచేస్తాయేమో అంటున్నారు విపక్ష పార్టీల నేతలు.
చంద్రబాబుకి షరతులతో కూడిన నాలుగు వారాల బెయిలు మంజూరు కావడంతో జగన్ ప్రభుత్వం బాబుపై వేసిన మరికొన్ని కేసుల తాలూకా విచారణలో ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి, అక్రమ కేసులపై ప్రభుత్వంతో ఎలా న్యాయపోరాటం చేయాలో చర్చించడానికి ఢిల్లీ వెళ్లారు నారా లోకేష్. ఇప్పుడు బాబు జైలు నుండి బయటకు వచ్చేసారు.ఇక ఇప్పుడు ఏ కొత్త కథనాలు ప్రచారం చేయడానికి నీలి మీడియా రంగం సిద్ధం చేస్తుందో ఇంకాకొద్దీ సమయంలోనే తెలుస్తుంది.
ఇక్కడేం వింటారో, అక్కడేం చెపుతారో? ఇక్కడేం చూస్తారో, అక్కడేం చూపిస్తారో? అంతా ‘బ్లూ’ మాయే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.





