నారా లోకేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Nara lokesh escaped from accidentపశ్చిమ గోదావరి జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్న టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లాలోని ఆకివీడులో ముంపునకు గురైన పంటలు, ఆక్వా చెరువులను పరిశీలించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి లోకేశ్ ‌వెళ్లారు.

ఆకివీడు మండలంలోని మండపాడు, ఐ.భీమవరం గ్రామాల్లో ముంపు బారిన పడిన వరి చేలను పరిశీలించారు. అనంతరం ఆకివీడు నుంచి సిద్దాపురం వెళ్లేందుకు లోకేశ్‌ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ క్రమంలో రహదారి పక్కన ఉప్పుటేరులోకి ట్రాక్టర్‌ జారింది. దీంతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ADVERTISEMENT

పెద్ద ప్రమాదం తప్పడంతో నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే వేరే ట్రాక్టర్‌ తెప్పించి పర్యటన కొనసాగించారు. అనంతరం ఆకివీడులోని పునరావాస కేంద్రాన్ని లోకేశ్‌ సందర్శించారు. అక్కడ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటన ఆసాంతం ప్రజలు లోకేష్ కు బ్రహ్మరథం పట్టారు.

ప్రజల సమస్యలు వింటూ… ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ లోకేష్ ముందుకు వెళ్తున్నారు. అయితే.. లోకేష్ పర్యటనకు కొంత మంది కీలక నేతలు, మాజీ మంత్రులు, దూరంగా ఉంటూ వస్తున్నారు. తమకు టీడీపీలో తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories