సమాజంలో ఏదైనా దారుణమైన ఘటన జరిగినప్పుడు సామాన్యుడి నుండి మీడియా వరకు రాజకీయ నాయకుల నుంచి ప్రభుత్వంలో మంత్రుల వరకు అందరు తమ స్పందన తెలియచేసారు. అయితే ఆ ఘటన జరిగిన ఒకటి రెండు రోజుల పాటు హడావుడి చేసి ఆ తరువాత ఎవరి దైనందిక కార్యక్రమాలలోకి వారు జారుకుంటారు.
అయితే ఇక్కడ రాప్తాడు ఘటన బాధిత బాలిక విషయంలో మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న ఆసక్తి, బాధ్యత నిజంగా అభినందనీయం. మంత్రిగా ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితి విషయంలో ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా అప్ డేట్ అందిస్తున్నారు మంత్రి లోకేష్.
రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో రంపంతో విచక్షణరహితంగా హేమంత్ అనే ఉన్మాది పదోతరగతి చదువుతున్న బాలిక మీద దాడి చేయడం, ఆ తరువాత ఆ బాలిక మెరుగైన వైద్యచికిత్స కోసం బెంగళూర్ లోని మణిపాల్ ఆసుపత్రికి చేరడం ఇదంతా తెలిసిన విషయమే.
అయితే ఆ బాలిక ను గ్రీన్ ఛానెల్ సాయంతో బెంగళూర్ మణిపాల్ ఆసుపత్రికి తరలించడం నుంచి నేడు ఆబాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేదాని వరకు లోకేష్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఆ బాలిక పూర్తి ఆరోగ్యం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.
తాజాగా లోకేష్ పోస్ట్ గమనిస్తే…ఉన్మాది రంపం దాడిలో గాయపడిన బాలికకు ఆసుపత్రి సిబ్బంది నిర్వహించిన ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం అయ్యిందని, బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని, బాలిక వైద్యులకు పూర్తిగా సహకరిస్తుందని, వేగంగా కోలుకుతుందంటూ పోస్ట్ చేసారు.
అలాగే దాడి సమయంలో బాలికకు తగిలిన గాయాలు కూడా క్రమంగా నయమవుతున్నాయని, బాలిక ఎడమ చేతికి ఉన్న సస్లింగ్ ను వైద్యులు తొలగించారని, ఆమె నెమ్మదిగా చేతిని కదిలించే ప్రయత్నం చేస్తుందని, త్వరలోనే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ నుంచి జనరల్ వార్డ్ కు మారుస్తారని లోకేష్ బాలిక ఆరోగ్య పరిస్థితి పై ఉన్న పూర్తి అప్ డేట్ ను పంచుకున్నారు.
ఇదిలా ఉంటే రాప్తాడు ఘటన నిందితుడు హేమంత్ మాత్రం తన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాడనే చెప్పాలి. ఇప్పటికే పోలీసుల కాల్పులలో హేమంత్ కాలును వైద్యులు తొలగించారు.







