నారా లోకేష్‌ పాదయాత్రలో మరో మైలురాయి… 700 కిమీ!

Nara_Lokesh_Yuva_Galam_Padayatra_700Kmsటిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో గురువారం మరో మైలురాయిని అధిగమించారు. గురువారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో 55వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించి గుట్టూరు గ్రామంలో 700 కిమీ మైలురాయిని అధిగమించారు.

ఈ విజయానికి నిదర్శనంగా నారా లోకేష్‌ గుట్టూరు గ్రామంలో శిలాఫలకం ఆవిష్కరించారు. తన ఈ సుదీర్గ పాదయాత్రకు గీటురాయిగా నిలిచిన గోరంట్ల, మడకశిర పరిధిలోని గ్రామాలకు త్రాగునీరు, సాగునీరు అందించి ఆ సమస్యలను శాస్వితంగా పరిష్కరిస్తామని అన్నారు. ఆ హామీని లిఖితపూర్వకంగా ఆ శిలాఫలకంపై చెక్కించారు.

ADVERTISEMENT

హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపోతల పధకం ద్వారా ఆ గ్రామాలకు సాగు, త్రాగు నీరు అందజేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈ హామీలను తప్పక నెరవేరుస్తానని నారా లోకేష్‌ గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

నారా లోకేష్‌ జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెంలోని పూతలపట్టు గ్రామంలో 100 కిమీల మొదటి మైలురాయిని అధిగమించారు. ఆ తర్వాత వరుసగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 200కిమీ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానుపురంలో 300కిమీ, చంద్రగిరి నియోజకవర్గంలో నెండ్రుగుంటలో 400 కిమీ, మధనపల్లి నియోజకవర్గంలో చిన్నతిప్ప సముద్రం వద్ద 500కిమీ, కదిరి నియోజకవర్గంలో చిన్నయపాలెంలో 600కిమీ మైలురాళ్ళను అధిగమించారు. నేడు 55వ రోజు పాదయాత్రలో పెనుకొండ నియోజకవర్గంలో గుట్టూరు గ్రామంలో 700 కిమీ మైలురాయిని అధిగమించారు.

నారా లోకేష్‌ పాదయాత్రతో టిడిపికి ఒరిగేదేమీ లేదు… వైసీపీకి ఎటువంటి నష్టమూ లేదని చెపుతూనే మొదట్లో ఎక్కడిక్కడ పోలీసులతో అడ్డుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేయడం అందరూ చూశారు. కానీ నారా లోకేష్‌ పాదయాత్రకు విపరీతమైన ప్రజాధారణ లభిస్తుండటం, పోలీసులు అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే, ఏ రాజ్యాంగం ప్రకారం అడ్డుకొంటున్నారంటూ నారా లోకేష్‌ ఎదురు ప్రశ్నిస్తుండటం, దీంతో యావత్ రాష్ట్ర ప్రజల దృష్టిని నారా లోకేష్‌ ఆకర్షిస్తున్నారని, తద్వారా యువగళం పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వమే ఉచితంగా పబ్లిసిటీ చేస్తున్నట్లవుతోందని గ్రహించిన్నట్లుంది. అందుకే ఇప్పుడు నారా లోకేష్‌ని పోలీసులు అడ్డుకోవడం లేదు!

కానీ యువగళం పాదయాత్రకు వస్తున్న జనాధారణ చూసి మంత్రులు, ఎమ్మెల్యేలు ఓర్వలేక, నారా లోకేష్‌ వెంట నడుస్తున్న వారందరూ పెయిడ్ ఆర్టిస్టులే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఒకసారి పాదయాత్రలో జనాలే లేరని చెప్పేది వారే… మరోసారి వేలాదిగా తరలివస్తున్న జనాలందరూ పెయిడ్ ఆర్టిస్టులే అని వాదించేది వారే.

మూడు రాజధానుల పేరుతో రాయలసీమలో టిడిపి నేతలెవరూ అడుగుపెట్టలేని పరిస్థితి కల్పిద్దామనుకొంటే, నారా లోకేష్‌ రాయలసీమలోనే పాదయాత్ర ప్రారంభించి వైసీపీ కుట్రను తిప్పికొట్టారు. రాయలసీమలోనే నారా లోకేష్‌ యువగళం పాదయాత్రకు ఇంత జనాధారణ లభిస్తోందంటే దానర్దం మూడు రాజధానుల కధని వారూ నమ్మడం లేదనే కదా?వారు కూడా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకొంటున్నట్లేగా?మూడు రాజధానులపై రిఫరెండంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ నాలుగు సీట్లు కోల్పోవడంతో వైసీపీకి పెద్ద షాక్. నారా లోకేష్‌ పాదయాత్ర విజయవంతం అవుతోందని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం కావాలి?

ఏదో ఓ నాలుగైదు రోజులు ముచ్చటగా నడిచి, తర్వాత కాళ్ళు నొప్పి పుడితే ఆయనే పాదయాత్ర విరమించుకొంటారనుకొంటే, 55 రోజులలో 700 కిమీ నడిచి అదే ఉత్సాహం, అదే స్పూర్తితో నారా లోకేష్‌ ముందుకు సాగిపోతున్నారు. ఈ లెక్కన 4000 కిమీ పాదయాత్ర పూర్తిచేయడం తధ్యమని స్పష్టమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories