కాజల్ అన్నయ్య అంటే వాకౌట్ చేస్తా!

Navdeep Kajal Agarwal No 1 Yaari With Ranaఅందాల బొమ్మ ‘చందమామ’ కాజల్ అన్నయ్య అని పిలిస్తే ఎవరైనా అంగీకరిస్తారా! బహుశా సినిమాలలో క్యారెక్టర్ల వరకైతే ‘పర్లేదని’ అంగీకరిస్తారేమో గానీ, ఆఫ్ ది స్క్రీన్ లో అలా పిలిస్తే పలికే వారుంటారా! ఎవరి సంగతి ఎలా ఉన్నా… హీరో నవదీప్ మాత్రం ‘ఒప్పుకోనంటే ఒప్పుకోనని’ తెగేసి చెప్పాడు. ఇదంతా రానా ‘నెంబర్ 1 యారి’ షోలో చోటు చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్ర బృందం పాల్గొన్న ఈ షోలో హోస్ట్ గా ఉన్న రానా, నవదీప్ కు కాజల్ ని చెల్లెల్ని చేసేసాడు.

ADVERTISEMENT

ఊహాజనితమైన అంశంలో భాగంగా… తనతో పెళ్ళికి కాజల్ ని ఒప్పించేందుకు ఓ అన్నయ్యగా ప్రయత్నించాలని రానా కోరడంతో… నేను కాజల్ కు అన్నయ్యా… ఇలా అయితే నేను వాకౌట్ చేస్తా… అంటూ సరదాగా లేచి వెళ్ళిపోయాడు. అలాగే మధ్య కాజల్ ‘అన్నయ్య’ అని పిలవగానే, ‘ఛీ’ అంటూ నవదీప్ ఇచ్చిన హావభావాలు వీక్షకులను విశేషంగా అలరించాయి. రానా – కాజల్ –నవదీప్ మాంచి స్నేహితులు కావడంతో, ఈ ఎపిసోడ్ చాలా సరదా సరదాగా గడిచిపోయింది.

ADVERTISEMENT
Latest Stories