హీరోయిన్ కు యాక్సిడెంట్… సెల్ఫీల కోసం ఎగబడ్డారు..!

Neha Dhupia in Accident, Onlookers Demand Selfiesసిల్వర్ స్క్రీన్ పై అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలంటే ప్రేక్షకులకు ఎంత క్రేజో అన్న దానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఘటన. ‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే… నా పేలాలు ఎగలేదని మరొకడు బాధపడ్డాడంట…’ అలా ఉంది బాలీవుడ్ హీరోయిన్ నేహాధూపియా పరిస్థితి. చండీగఢ్ లో ఓ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో యాక్సిడెంట్ కు గురైంది. కాగా, ఈ ఘటనలో నేహాకు గాయాలు కాలేదు గానీ, ఆమె కళ్ళ జోడు పగిలిపోయింది.

రోడ్డు మధ్యన ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కారులో ఉన్న వారికి సాయం చేయడానికి వెళ్లిన వారు… అందులో ఉన్నది హీరోయిన్ నేహా ధూపియాగా గుర్తు పట్టడంతో, ఆమె పరిస్థితిని పట్టించుకోకుండా అక్కడున్న వారంతా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ పరిణామాలతో ఇబ్బందులకు గురైన నేహా, తప్పనిసరి పరిస్థితులలో ఓ అరగంట సేపు వారికి సెల్పీలతో పాటు, ఆటోగ్రాఫ్ లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వేరే కారు రావడంతో ఎయిర్ పోర్టుకు పయనమైంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories