“నేలటిక్కెట్టు” కోసం ఇంత రచ్చ జరిగిందా?

Nela-Ticket-Trailer-Talk-Extremely-Routine-And-Messyకొత్త సినిమాల విడుదల సమయంలో ప్రేక్షకుల నుండి ‘ఫస్ట్ టాక్’ తెలుసుకునేందుకు ఐ మాక్స్ వంటి మల్టీప్లెక్స్ ల వద్ద మీడియా ప్రతినిధులు ఆసక్తిగా ఎదురుచూసే విషయం తెలిసిందే. ఈ వేదికలపై కొందరు చెప్పే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ఇదే విధంగా రవితేజ “నేలటిక్కెట్టు” ఫస్ట్ టాక్ తెలుసుకునేందుకు కూడా మీడియా వర్గాలు ఐ మాక్స్ వద్ద కొలువుతీరగా, కొందరు వచ్చి సినిమాపై అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేసారు.

అయితే ఈ సందర్భంలో సినిమా చూడకుండా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని భావించిన ఓ మీడియా వ్యక్తి… సినిమా చూసిన టిక్కెట్టు చూపించాలని నిలదీశాడు. మరోవైపు మీ మీడియా ఐడీ కార్డు చూపించాలని సదరు వ్యక్తి డిమాండ్ చేసాడు. దీంతో వీరిద్దరి మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఫైనల్ గా సదరు వ్యక్తి టిక్కెట్టు చూపించకుండానే అక్కడి వెళ్ళిపోగా, మరికొందరు కూడా సదరు మీడియా వ్యక్తితో వాగ్వివాదానికి దిగారు.

ADVERTISEMENT

అయితే వీరందరినీ ప్రతిఘటించిన సదరు మీడియా వ్యక్తి…. సినిమా చూసిన తర్వాత ఎలాంటి అభిప్రాయం చెప్పినా పర్లేదు గానీ, చూడకుండానే ఇండస్ట్రీని నాశనం చేసే వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించనని తేల్చిచెప్పాడు. ఇండస్ట్రీ వ్యక్తులే సినీ పరిశ్రమకు ద్రోహం చేస్తున్నారని మండిపడగా, ఇంత జరిగింది “నేలటిక్కెట్టు” సినిమా కోసమా అంటూ వాపోవడం వీక్షకుల వంతవుతోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫలితాన్ని ప్రేక్షకులు ఏ విధంగా డిక్లేర్ చేసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ADVERTISEMENT
Latest Stories