ఈ టైంలో ‘ఈగో’కు పోకూడదు డైరెక్టర్ గారు!

Nela-Ticket Director -Kalyan Krishnaఅల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, అందులో కొన్ని మంచి డైలాగ్స్ ను రచయిత కం డైరెక్టర్ అయిన వక్కంతం వంశీ రాసారు. ‘ఈగో’కు పోకూడదు, పోతే అది ప్రాణం మీదకు వస్తుందన్న రెండు సీన్స్ చాలా బాగా పండించారు. నిజమే… కొన్ని కొన్ని సందర్భాలలో రియల్ లైఫ్ లో కూడా అనుసరించాల్సిన సూత్రం ఇది. కానీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల మాత్రం “నేలటిక్కెట్టు” సినిమా విషయంలో తన ‘ఈగో’ను ప్రదర్శిస్తున్నట్లుగా కనపడుతోంది.

ఈ సినిమాను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించిన విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే దారుణమైన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు రివ్యూలు కూడా అత్యంత దయనీయంగా వచ్చాయి. అయితే తన సినిమా బాగుందని, మౌత్ టాక్ తో ఇప్పటికీ బాగా ఆడుతోందని, రివ్యూల మాటలు పట్టించుకోవద్దంటూ… పలువురు సినీ ప్రేక్షకులతో, ధియేటర్ యాజమాన్యాలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. మరో పక్కన పోస్టర్లలో కూడా ‘జనం మెచ్చిన సినిమా’ అంటూ హంగామా చేస్తున్నారు.

ADVERTISEMENT

కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం అన్న సంగతి బహిరంగమే. ‘నేలటిక్కెట్టు’ ధియేటర్లన్నీ ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. ప్రేక్షకులు సక్సెస్ ఇచ్చినపుడు ఆనందంగా తీసుకున్న కళ్యాణ్ కృష్ణ, రివర్స్ అయినపుడు రివ్యూల మీద పడడం ఎంతవరకు సమంజసమో ఆయనే మననం చేసుకోవాలి. స్టార్ హీరోలు, డైరెక్టర్లకు కూడా దారుణ పరాజయాలు వస్తున్నాయి, రివ్యూలు కూడా అందుకు తగ్గట్లుగానే వస్తున్నాయి, వాళ్ళంతా బహిరంగంగానే వాటిని ఒప్పుకునే పరిస్థితి నెలకొంది. మరి కళ్యాణ్ కృష్ణ అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం ఎలా?

ADVERTISEMENT
Latest Stories