కరోనా బారిన పడి ఏపీలో మొదటిసారిగా వైద్యుడి మృతి

nellore doctor died with coronavirusమీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి కొరోనా వైరస్ సంబంధిత మరణాన్ని నమోదు అయ్యింది. నెల్లూరు నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రసిద్ధ ఆర్థోపెడిక్ వైద్యుడు కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ కన్నుమూశారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైరస్ బారిన పడి ఒక డాక్టర్ మరణించడం ఇదే మొదటిసారి.

ADVERTISEMENT

అయితే ఆయనకు వైరస్ ఎలా సోకింది అనేది అధికారులు తెలపాల్సి ఉంది. కర్నూల్, గుంటూరు జిల్లాల తరువాత నెల్లూరు లోనే ఎక్కువ కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇది ఇలా ఉండగా… అధికారుల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 417. గత రాత్రి నుండి ఈ ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా పన్నెండు కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి పాజిటివ్‌గా తేలినట్లు నిర్ధారించారు.

విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 12 మందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీ వెళ్లిన వారిలో 199 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. వారిద్వారా 161 మందికి కరోనా సోకిందని చెబుతున్నారు. ఇతరత్రా మార్గాల వల్ల 32 మందికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు.

మరోవైపు కేసులు పెరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ లో మాస్కులు పంచిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఒక్క పౌరుడికి మూడు మాస్కులు చప్పున ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పదహారు కోట్ల మాస్కులు ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. అయితే ఎటువంటి మాస్కులు పంపిణీ చేస్తారు అనేదాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories