స్వయంకృషి ఎఫెక్ట్… శర్వ, నానిల కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్..!

Nenu Local Vs Shatamanam Bhavati Collectionsకొత్త సంవత్సరం తెలుగు సినిమాలకు బాగా కలిసి వస్తున్నట్లుగా కనపడుతోంది. విడుదలైన ప్రతి ప్రముఖ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండడంతో తెలుగు చిత్ర సీమ కళకళలాడుతోంది. సంక్రాంతి విడుదలైన రెండు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాగా రిలీజ్ చేసిన శర్వానంద్ “శతమానం భవతి” సినిమా గ్రాండ్ సక్సెస్ అందుకుని, శర్వ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకు 30 కోట్లు పైనే షేర్ కొల్లగొట్టిందని ట్రేడ్ టాక్.

అలాగే మరీ చిన్న చిత్రం కాకపోయినా, నాని హీరోగా విడుదల అయిన “నేను లోకల్” సినిమా కూడా మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “భలే భలే మగాడివోయ్” సినిమా రికార్డులను బద్ధలుకొట్టే విధంగా “నేను లోకల్” సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుందన్నది సినీ వర్గాల సమాచారం. యుఎస్ లో 1 మిలియన్ డాలర్స్ అందుకున్న ఈ సినిమా కూడా 30 కోట్ల షేర్ మార్కెట్ ను అందుకుందన్నది లేటెస్ట్ న్యూస్.

ADVERTISEMENT

ఈ రెండు సినిమాలను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించడం మరో ప్లస్ పాయింట్. ధియేటర్ల ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడంలో దిల్ రాజు దిట్ట అన్న విషయం బహిరంగ సత్యమే. దీంతో శర్వానంద్, నాని కెరీర్ లలో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన నిర్మాతగా దిల్ రాజు నిలిచిపోనున్నాడు. మరో విశేషం ఏమిటంటే… ఈ ఇద్దరూ హీరోలు కూడా ఫెయిల్యూర్స్ లేకుండా తమ కెరీర్ గ్రాఫ్ ను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. ఏ తరంలో అయినా “స్వయంకృషి” ప్రభావం అలాగే ఉంటుంది అంటున్నారు సినీ ప్రియులు.

ADVERTISEMENT
Latest Stories