135 నిముషాల ‘నేను.. శైలజ…’ ప్రేమకధ!

nenu-sailaja-censor-reportకొత్త దర్శకుడు తిరుమల కిషోర్ తెరకెక్కించిన “నేను.. శైలజ…” చిత్రం నూతన సంవత్సర కానుకగా జనవరి 1వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు బోర్డ్ సభ్యులు “క్లీన్ యు’ సర్టిఫికేట్ మంజూరు చేసారు.

పూర్తి ప్రేమకధా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా 135 నిముషాల నిడివి ఉండనుంది. రన్ టైం సినిమాకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. దేవిశ్రీ అందించిన ఆల్బమ్ సూపర్ హిట్ కావడం, క్యూరియాసిటీతో కూడిన ధియేటిరికల్ ట్రైలర్ ప్రేక్షకుల మెప్పు పొందడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

విక్టరీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తనకు “నేను.. శైలజ…” ఖచ్చితంగా సక్సెస్ ఇస్తుందనే ఆశాభావంతో హీరో రామ్ ఉన్నాడు. సొంత బ్యానర్ స్రవంతి పతాకం పైనే ఈ సినిమా నిర్మితమైంది. 2016 అయినా రామ్ ఫేట్ ను మారుస్తుందో లేదో చూడాలి.
nenu sailaja censor report

ADVERTISEMENT
Latest Stories