పబ్లిసిటీ అంతా ‘మిల్కీ బ్యూటీ’ సౌందర్యం చుట్టూనే!

Next-Enti-Trailer---Tamannaahసందీప్ కిషన్ – తమన్నా- నవదీప్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన “నెక్స్ట్ ఏంటి” సినిమా ప్రమోషన్ మెటిరియల్ అంతా మిల్కీ బ్యూటీ తమన్నా కేంద్రంగానే జరుగుతున్నట్లుగా కనపడుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండి ట్రైలర్ వరకు అంతా మిల్కీ బ్యూటీ సౌందర్యమే హైలైట్ గా సాగగా, తాజాగా ట్రైలర్ తదుపరి మెటిరీయల్ కూడా తమన్నా చుట్టూనే తిరుగుతోంది.

ట్రైలర్ విడుదలైన 48 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుందంటూ విడుదల చేసిన పోస్టర్లో మిల్కీ బ్యూటీ కాస్ట్యూమ్స్ హైలైట్ గా నిలిచాయి. షార్ట్ డ్రెస్ లో తమన్నా లెగ్ సౌందర్యాలను బహిరంగపరుస్తున్న ఈ పోస్టర్ యూత్ కు అట్రాక్షన్ గా నిలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories