30 రోజులు కలిసి ఉన్న నాగశౌర్య, నిహారిక!

niharika-konidela-30-days-shooting-with-naga-shouryaమెగా తనయురాలు నిహారిక వెండితెరకు సిద్ధమవుతున్న సినిమా “ఒక మనసు.” యువహీరో నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ చిత్ర దర్శకుడు రామరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్ గుడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఈ నేపధ్యంలో మరో ఫీల్ గుడ్ చిత్రంగా “ఒక మనసు” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని హీరో హీరోయిన్లు నాగశౌర్య, నిహారిక తెలిపారు.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా “ఒక మనసు” విశేషాలను తెలియజేసారు. మంచి అద్భుతమైన ప్రేమకావ్యంగా ‘ఒక మనసు’ తెరకెక్కిందని, 30 రోజుల పాటు మేమిద్దరం తప్ప షూటింగ్ లో మరొకరు లేరని, ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ వచ్చారని, సినిమా అయిపోయి ధియేటర్ నుండి వచ్చిన తర్వాత ఒక రోజు పాటు ఈ సినిమా అనుభూతులు గుర్తుంటాయని చెప్పారు.

ADVERTISEMENT

సునీల్ కశ్యప్ అందించిన సంగీతం, రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఇటీవల కాలంలో వచ్చిన చిత్రాలలో ది బెస్ట్ అని, ఇలాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయని హీరో శౌర్య తెలుపగా, ప్రేమకథలంటే అస్సలు ఇష్టపడని తన తండ్రి ఎందుకో ఈ కధకు ఓటు వేసారని, విన్న మొదటిసారే అందరూ ఫ్లాట్ అయిపోయామని మెగా వారసురాలు నిహారిక చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT
Latest Stories