అఖిల్ బాటలోనే నిఖిల్ వివాహం కూడా?

Nikhil Siddharth Wedding Cancelledఅంగరంగ వైభవంగా జరిగిన నిశ్చితార్ధ వేడుక తర్వాత అక్కినేని అఖిల్ వివాహం రద్దయిన విషయం తెలిసిందే. కారణాలు ఏవైనా గానీ, ప్రస్తుతం అఖిల్ దాని నుండి బయటకు వచ్చేసి సినిమాలు కూడా చేసుకుంటున్నారు. అఖిల్ పరిస్థితి ఇలా ఉంటే, ప్రస్తుతం నిఖిల్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అఖిల్ మాదిరిగా నిఖిల్ నిశ్చితార్ధం ఇంకా జరగలేదు గానీ, అది కాక ముందే నిఖిల్ కుటుంబ సభ్యులు ఈ పెళ్ళికి బ్రేక్ వేసినట్లుగా టాక్.

ఓ వ్యాపారవేత్త తనయురాలు తేజస్వినితో నిఖిల్ వివాహాన్ని నిర్ణయించిన దరిమిలా, ఈ నెల 24వ తేదీన నిఖిల్ నిశ్చితార్ధ వేడుక జరగాల్సి ఉంది.కానీ అది జరగలేదు. ఇరువురి జాతకాలు ఆశించిన విధంగా కలవలేదు గనుక, దీనిని ఇక్కడితో ఆపెయడమే ఉత్తమమనే నిర్ణయానికి ఇరువురు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో నిఖిల కోసం మరో సౌందర్య రాశిని అన్వేషించే పనిలో పడ్డారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories