బ్లాక్ బస్టర్ వీడియో సాంగ్స్ వచ్చేస్తున్నాయ్!

Ninnu Kori Movie Songs - Unnattundi Gundeyగత కొంత కాలంగా టాలీవుడ్ లో సినిమాలు హిట్టవుతున్నాయోమో గానీ, ఆడియోలకు మాత్రం పెద్దగా స్పందన రావడం లేదు. కానీ చాలాకాలం తర్వాత నాని హీరోగా తెరకెక్కిన “నిన్ను కోరి” ఆల్బమ్ కు అదిరిపోయే స్పందన లభించింది. గోపి సుందర్ స్వరపరిచిన ఈ ఆడియో ‘బ్లాక్ బస్టర్’ టాక్ ను సొంతం చేసుకోగా, ఆ పాటలను సినిమాలో చిత్రీకరించిన విధానం మరింత ఆకట్టుకోవడంతో… ఆడియో పరంగానే కాక, వీడియో పరంగా కూడా చూడముచ్చటగా ఉన్నాయి.

బాక్సాఫీస్ వద్ద ‘సూపర్ హిట్’ సాధించిన ఈ సినిమా వీడియో సాంగ్స్ ను చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఆడియో మాదిరిగానే ముందుగా ‘అడిగా అడిగా…’ పాటను విడుదల చేయగా, తాజాగా ‘ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే…’ అన్న పాటను విడుదల చేసారు. ఈ ఆడియోలో హైలైట్ గా నిలిచిన పాటలలో ఇది ఒకటి కావడంతో వీక్షకుల నుండి స్పందన అదిరిపోయింది. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండా రిలీజ్ చేయడంతో, సినీ అభిమానులు థ్రిల్ కు గురయ్యారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories