అభిమాని ట్వీట్ కు కన్నీళ్లు పెట్టిన హీరో!

Nani Ninnu Kori USA Collectionsవరుసగా ఏడు సక్సెస్ లు అందుకున్న హీరో నాని నటించిన తాజా సినిమా “నిన్ను కోరి” కాన్సెప్ట్ యూనివర్సల్ గా ప్రశంసలు పొందింది. రీల్ లైఫ్ లో అదరగొట్టిన ఈ సినిమా రియల్ లైఫ్ లోనూ ప్రభావితం చేస్తోందని ఓ అభిమాని తన ఆవేదనను హీరో నానికి మరియు రచయిత కోన వెంకట్ కు వెలిబుచ్చుకున్నాడు. “నిన్ను కోరి” సినిమా చూసిన తర్వాత, నా గర్ల్ ఫ్రెండ్ నా మంచి కోరి విడిపోయింది, ఇదేంటి సర్… అంటూ తన బ్రేకప్ కధను క్లుప్తంగా వ్యక్తపరిచారు.

సాధారణంగా ఇలాంటి ట్వీట్స్ హీరోలకు కోకొల్లలుగా వస్తుంటాయి. దీంతో వీటికి ప్రతిస్పందించే హీరోలు చాలా తక్కువ. కానీ నాని మాత్రం ‘ఏడుస్తున్నట్లుగా’ రెండు ఏమోజీ పోస్ట్ చేసాడు. అభిమాన హీరో నుండి ఊహించని ట్వీట్ రావడంతో సదరు అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే అసలు విషయం ఏమిటంటే… ఈ బ్రేకప్ నిజం కాదు. తన స్నేహితుడి విజ్ఞప్తి మేరకే “నిన్ను కోరి” చిత్ర యూనిట్ సభ్యులకు ఓ ప్రాంక్ గా సదరు అభిమాని ట్వీట్ చేసాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories