‘జనతా గ్యారేజ్’ సెట్ లో ‘పవన్ కళ్యాణ్’ అభిమాని!

Nithiin at NTR Janatha Garage shootingజూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా “జనతా గ్యారేజ్” షెడ్యూల్ ఇటీవలే చెన్నైలో పూర్తయ్యి, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఏడు ఎకరాల సెట్ లో పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ నేతృత్వంలో వేసిన అందమైన సెట్ లో జూనియర్ ఎన్టీఆర్, సమంతలపై చిత్రీకరిస్తున్న ఈ పాటను వీక్షించడానికి పవన్ కళ్యాణ్ అభిమాని వెళ్లారు.

ADVERTISEMENT

పవన్ వీరాభిమానిగా ముద్ర పడిన యువ హీరో నితిన్ చాలాకాలం తర్వాత యంగ్ టైగర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ తో ఉన్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసుకున్న నితిన్… ‘తారక్ వేసిన డ్యాన్స్ కన్నుల పండుగగా’ ఉన్నాయంటూ తన అనుభూతులను పంచుకున్నాడు. ప్రస్తుతం ‘అ…ఆ…’ సినిమా ద్వారా ధియేటర్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హీరో నితిన్ సరికొత్త లుక్ లో కనపడుతుండగా, తారక్ మాత్రం సేమ్ గడ్డం లుక్ లో ఆకట్టుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories